భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. సరిహద్దుల వెంట 26 ప్రదేశాలపై డ్రోన్లు, శతఘ్నలతో పాక్ దాడి చేయగా భారత్ ప్రతిస్పందనలో భాగంగా మూడు ప్రధాన వైమానిక స్థావరాలపై దాడి చేసింది. పాక్ సైనిక ప్రతినిధి అహ్మద్ షరీఫ్ ఈ దాడులను ధృవీకరించడం గమనార్హం. పాక్ సైన్యం హెడ్ క్వార్టర్స్ ఉన్న ప్రాంతాలలో ఈ దాడులు జరగడం కొసమెరుపు.
 
అయితే ఈ దాడులకు సరైన రీతిలో స్పందిస్తామని ఆ దేశ సైన్యం వెల్లడించింది. మన దేశంపై జరిగిన దాడులకు పాక్ " ఆపరేషన్ బున్యాన్ ఉన్ మర్సూస్" అని పేరు పెట్టింది. ఈ దాడుల గురించి భారత వాయుసేన, సైన్యం నుంచి ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన వెలువడకపోవడం గమనార్హం. ఈరోజు ఉదయం 10 గంటల సమయంలో భారత సైన్యం ప్రెస్ మీట్ నిర్వహించనుందని సమాచారం.
 
భారత్ పాక్ సరిహద్దు ప్రాంతాల్లో నిన్న పగటి పూట కొంతమేర ప్రశాంతత నెలకొన్నా రాత్రి సమయంలో మాత్రం పాకిస్తాన్ భారత్ పై దుస్సాహసానికి ఒడిగట్టిందని సమాచారం అందుతోంది. బారాముల్లా నుంచి భుజ్ వరకు పాకిస్తాన్ 26 ప్రాంతాలపై వరుసగా డ్రోన్లను పంపిందని సమాచారం అందుతోంది. అవంతీపోరా వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని పంపిన డ్రోన్లను మన దేశ సైన్యం విజయవంతంగా నిర్వీర్యం చేసి సత్తా చాటిందని భోగట్టా.
 
ఈరోజు తెల్లవారు జాము నుంచి పాకిస్తాన్ తిరిగి దాడులు మొదలుపెట్టినట్టు సమాచారం అందుతోంది. పోరు ఇదే విధంగా కొనసాగితే పాకిస్తాన్ గుల్ల కావడం పక్కా అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితి నుంచి పాక్ కోలుకోవడానికి 10 నుంచి 20 సంవత్సరాల సమయం పడుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. గతేడాది చివరి నాటికి పాకిస్తాన్ అప్పు 131 బిలియన్ డాలర్లు అని సమాచారం అందుతోంది.
 
పాకిస్తాన్ దేశాన్ని ఇప్పటికే ఎన్నో సామాజిక సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. యుద్ధం సృష్టించే భారాన్ని మోసే పరిస్థితి పాకిస్తాన్ కు ఏ మాత్రం లేదు. పాకిస్తాన్ లో రక్షణ వ్యవస్థ సైతం బలోపేతంగా లేదని సమాచారం అందుతోంది. యుద్ధం ఇదే విధంగా కొనసాగితే భారత్ 2.5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందని పాకిస్తాన్ సైతం ఇదే స్థాయిలో ఖర్చు చేయాల్సి ఉంటుంది.
 


మరింత సమాచారం తెలుసుకోండి: