భారత్ – పాక్ మధ్య జరుగుతున్న వార్ నేపథ్యంలో దేశ ప్రజలు త‌మ ఇండియ‌న్ ఆర్మీవార్ లో పోరాడి భార‌త దేశాన్ని గెలిపించాల‌ని క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురు చూస్తున్నారు. ప్ర‌తి ఒక్క‌రు కూడా ఆర్మీ కృషి ని .. పాత్ర‌ను కొనియాడుతున్నారు. అయితే ఈ యుద్ధం లో ప‌లువురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వీరి లోనే ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని స‌త్య‌సాయి జిల్లాకు చెందిన జవాన్ మురళీ నాయక్ కూడా ఉన్నారు. అప్ప‌టి వ‌ర‌కు నార్త్ ఇండియా లోనే విధులు నిర్వ‌హించిన ముర‌ళీ నాయ‌క్ కు వెంట‌నే పాక్ తో యుద్ధ నేప‌థ్యంలో క‌శ్మీర్ స‌రిహ‌ద్దుల‌కు రావాల‌ని పిలుపు వ‌చ్చింది. అక్క‌డ విధులు నిర్వ‌హిస్తోన్న క్ర‌మంలో కాశ్మీర్‌ సరిహద్దులో పాకిస్థాన్ సైన్యం కాల్పుల్లో మురళీ నాయక్ మృతి చెందారు. ముర‌ళీ నాయ‌క్ మృతి యావ‌త్ దేశాన్ని తీవ్రంగా క‌లిచి వేసింది.


ఇక ముర‌ళీ నాయ‌క్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఆయన మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ప్రజలు తీవ్ర విషాదంలోకి వెళ్లారు. ఇక పలువురు రాజకీయ నాయకులు ఆయన మృతి పట్ల త‌మ ప్ర‌గాడ సంతాపం కూడా వ్య‌క్తం చేశారు. రాజ‌కీయ .. సినీ ప్ర‌ముఖులు ముర‌ళీ నాయ‌క్ మృతికి సంతాపం తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు, లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా పలువురు మంత్రులు, నాయకులు మురళీ నాయక్‌కు తమ నివాళి తెలిపారు.


ఇదిలా ఉంటే స‌త్యసాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యే గా ఉన్న ప్ర‌ముఖ సినీ న‌టుడు నంద‌మూరి బాలకృష్ణ మురళీ నాయక్ మృతిపై తన సంతాపం తెలిపారు. ఆ వీర జవాన్ కుటుంబానికి తాను అండగా ఉంటాన‌ని తెలిపిన బాల‌య్య త‌న ఒక నెల జీతాన్ని ఆ కుటుంబానికి అందించ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. మే 12న మురళీ నాయక్ స్వగ్రామంలో ఆయన తల్లిదండ్రులకు ఈ ఆర్థిక సాయాన్ని అందించనున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: