
రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకానికి 16.20 లక్షల దరఖాస్తులు స్వీకరించారు. ఇందులో 5 లక్షల మందికి గరిష్ఠంగా 4 లక్షల రూపాయల విలువైన యూనిట్లను మంజూరు చేయనున్నారు. రూ.1-2 లక్షలు, రూ.2-4 లక్షల విలువైన యూనిట్లకు దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి. ఉదాహరణకు, ఎస్సీ కార్పొరేషన్ కింద 20 వేల యూనిట్ల లక్ష్యానికి 3.24 లక్షల దరఖాస్తులు, బీసీ కార్పొరేషన్ కింద 22 వేల యూనిట్లకు 6.66 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈబీసీ కేటగిరీలో 8 వేల యూనిట్లకు 32 వేల దరఖాస్తులు నమోదయ్యాయి.
దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించేందుకు క్షేత్రస్థాయి కమిటీలు పనిచేస్తున్నాయి. అనర్హులను తొలగించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. సంక్షేమ కార్పొరేషన్ డేటాబేస్ ఆధారంగా గతంలో లబ్ధి పొందినవారిని గుర్తించి, ఐదేళ్లపాటు మరోసారి రుణం పొందకుండా అనర్హులుగా ప్రకటిస్తారు. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలను ఆధార్ డేటాతో సరిపోల్చి ధృవీకరిస్తున్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీల జనాభా ఆధారంగా యూనిట్లను ఖరారు చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. ఒక కుటుంబానికి ఒక్కరికి మాత్రమే ఈ పథకం మంజూరు చేస్తారని అధికారులు స్పష్టం చేశారు. ఈ పథకం యువతకు స్వయంఉపాధి ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించేందుకు దోహదపడుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు