ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో ఊహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి.  కూటమి సర్కార్ సంక్షేమ పథకాల దిశగా అడుగులు వేయడంతో ఈ పథకాల ద్వారా ఎన్నో కుటుంబాలు లబ్ది పొందుతున్నాయి. ఏపీ రాజకీయాలలో  నారా లోకేష్ సైతం యాక్టివ్ అవుతుండటం గమనార్హం. ఏపీ మహిళల ఖాతాలలో 13,000 రూపాయల చొప్పున నగదు జమవుతోంది. ఉమ్మడి కడప జిల్లాలోని ఒక ఉమ్మడి కుటుంబంలో ఏకంగా 12 మంది పిల్లలకు ఈ స్కీమ్  నగదు జమ కావడం గమనార్హం.

గతంలో వైసీపీ 13000 రూపాయలు మాత్రమే ఇవ్వడం గురించి లోకేష్ కామెంట్లు చేయగా ఆ వీడియోను వైసీపీ ఇప్పుడు వైరల్ చేస్తుండటం గమనార్హం.  ప్రస్తుతం వైసీపీ నేతలు  లోకేష్ జేబులోకి 2000 రూపాయలు వెళ్లాయంటూ  కామెంట్లు చేస్తున్నారు.  అయితే నారా లోకేష్ ఈ ఆరోపణలను తేలికగా తీసుకోలేదు. ఆరోపణలను  నిరూపించని పక్షంలో  చట్టపరంగా చర్యలు తీసుకుంటానంటూ  లోకేష్ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.

రాష్ట్రంలో 87 లక్షల మంది  విద్యార్థులు ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్నారని  అయితే ఈ కామెంట్ పై  అంగన్వాడీ పిల్లలను సైతం కలిపారని  లోకేష్ చెబుతున్నారని ఆ పిల్లలను ఈ జాబితాలో కలపలేదని సాక్షి చెబుతోంది.  గతంలో విద్యాశాఖ మంత్రికి బేసిక్స్ కూడా తెలియవని లోకేష్  కామెంట్ చేశారని  ఈ సందర్భంగా గుర్తు చేస్తోంది.  మీ తప్పులు ఎత్తిచూపినా మీ అబద్దాలను  ఎండగట్టినా  తట్టుకోలేక అధికారం, అహంకారంతో బెదిరిస్తున్నారని  సాక్షి పత్రిక పేర్కొంది.

గతంలో 2,000 రూపాయలు కట్ చేస్తే మీరు విమర్శలు చేసారని ఇప్పుడు మేము విమర్శలు చేస్తుంటే  ఎందుకు తీసుకోలేకపోతున్నారని వైసీపీ, సాక్షి ప్రశ్నిస్తున్నాయి.  గతంలో  లోకేష్ జగన్ ను సైతం  అనకూడని  మాటలు అన్నారని  అలా  అయితే మేము ఎన్ని కేసులు పెట్టాలని  సాక్షి ప్రశ్నిస్తోంది.   మేము ఎవరిపై కేసులు పెట్టాలంటూ  వైసీపీ సోషల్ మీడియాలో పేర్కొంది. ఈ వివాదం రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: