
పోలీసులు ఈ కేసులో జగన్‌ను ఏ2గా పేర్కొన్నారు. డ్రైవర్ రమణారెడ్డిని ఏ1గా, జగన్ వ్యక్తిగత సహాయకుడు నాగేశ్వర్‌రెడ్డిని ఏ3గా చేర్చారు. అంతేకాక, మాజీ ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి ఏ4గా, మాజీ మంత్రులు పేర్ని నాని ఏ5గా, విడదల రజిని ఏ6గా జాబితాలో ఉన్నారు. ఈ ఘటనలో తెలిసీ జరిగిన నేరం ఆరోపణలతో సెక్షన్ 304 పార్ట్-2, బీఎన్‌ఎస్ 105 సెక్షన్లను పోలీసులు జోడించారు. ఈ సెక్షన్లు నాన్-బెయిలబుల్ కేసుగా మార్చాయి.
ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జగన్ కాన్వాయ్‌లో అనుమతించిన 14 వాహనాలకు మించి 50కి పైగా వాహనాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ అనధికార కాన్వాయ్ వల్లే గందరగోళం ఏర్పడి ప్రమాదం జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సింగయ్య మరణంపై వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన జగన్ రాజకీయ ఇమేజ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది.
పోలీసులు డ్రైవర్ రమణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. వీడియో ఆధారాలతో కేసు బలపడుతున్నట్లు గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. ఈ కేసు తదుపరి విచారణలో ఏ విధంగా మలుపు తిరుగుతుంది అనేది రాష్ట్ర రాజకీయ వర్కొం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. సింగయ్య కుటుంబానికి న్యాయం జరుగుతుందా అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు