వైసిపి పార్టీలో తాజాగా ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నట్లు కనిపిస్తోంది.కొంత మేరకు గ్రాఫ్ పెరిగినట్టుగా కనిపిస్తోంది. ఇతర పార్టీ నేతలు కూడా వైసిపి పార్టీలోకి రావడానికి ఇష్టపడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే రాజకీయాలకు గుడ్ బై చెబుతూ రాజీనామా చేసిన వైసీపీ సీనియర్ నేత మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇప్పుడు మళ్లీ రాజకీయాలలో యాక్టివ్ కావాలని ఆలోచనలో ఉన్నట్లు రాజకీయ వర్గాలలో ఎక్కువగా వినిపిస్తోంది. జగన్ లండన్ లో ఉన్న సమయంలో విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. ముఖ్యంగా జగన్ చుట్టూ ఉన్న కోటగిరి కారణం వల్లే చాలామంది పార్టీ వీడుతున్నారని అప్పట్లో ఆయన తెలియజేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.


అయితే ఇప్పుడు తాజా పరిస్థితులను చూస్తే విజయసాయిరెడ్డి మళ్ళీ వైసీపీ పార్టీలోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు రాజకీయ వర్గాలలో వినిపిస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా అటు విజయసాయిరెడ్డికి ,వైయస్ కుటుంబానికి చాలా విడదీయరాని బంధం ఉన్నది. రాజశేఖర్ రెడ్డి హయాంలోనే టీటీడీ బోర్డు సభ్యుడుగా, ఓబీసీ కార్పొరేషన్ డైరెక్టర్ గా కూడా ఉండేవారు. రాజశేఖర్ రెడ్డి మరణం అనంతరం జగన్ పక్కన అండగా నిలబడ్డారు విజయసాయిరెడ్డి.


ఇక జగన్ తో పాటుగా జైలు జీవితాన్ని గడిపిన విజయసాయిరెడ్డి వైసీపీ తొలి రాజ్యసభ సభ్యుడిగా కూడా గెలిచారు. 2019లో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో మధ్యవర్తిగా ఉన్నారు. 2024 ఎన్నికలలో నెల్లూరు నుంచి ఓటమి చవిచూసిన విజయసాయిరెడ్డి పార్టీలో కొన్ని నిర్ణయాలు ఆయనకు నచ్చకపోవడంతో బయటికి వచ్చేసానంటూ తెలిపారు. అయితే ఇప్పుడు మళ్లీ తిరిగి వైసిపి పార్టీలో రీయంట్రి రావాలని ఆలోచనకు కూడా జగన్ సానుకూలంగానే ఉన్నట్లుగా వినిపిస్తున్నాయి.మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడుగా ఉన్న ఒక నేత ఈ విషయాన్ని జగన్ దృష్టికి తీసుకువెళ్లారట. దీంతో విజయసాయిరెడ్డి పార్టీలో ఉంటే మేలు జరుగుతుందనే అభిప్రాయాన్ని పంచుకున్నారట. అందుకే విజయసాయిరెడ్డితో సంప్రదింపులు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: