ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తాజాగా ఒక సంచలనం చోటుచేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చిహ్నాన్ని వెంటనే మార్చాలంటూ ఆ పార్టీకి సంబంధించిన వ్యవస్థాపకుడు ఈసీకి లేఖ రాసినట్లు ఒక లెటర్ సంచలనంగా మారింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు అయిన శివకుమార్ తమకు కేటాయించిన ఫ్యాన్ గుర్తును తొలగించాలని వాటి స్థానంలో గొడ్డలి గుర్తుని కేటాయించాలంటూ అభ్యర్థిస్తూ ఈసీకి ఒక లేఖ రాసినట్లు వైరల్ గా మారుతున్నది.

ఇక ఆ లేఖలో ప్రస్తుతం మా పార్టీకి కేటాయించినటువంటి చిహ్నం ఫ్యాన్.. జాగ్రత్తగా పరిశీలించి మరి అంతర్గత సంప్రదింపుల తర్వాత మా పార్టీ గుర్తుని సైతం  గొడ్డలిగా మార్చాలనుకుంటున్నాము అందుకు తాను ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నానని.. పార్టీ భవిష్యత్తు ,గుర్తింపు ,రాజకీయ వ్యూహం దృష్ట ఈ నిర్ణయాన్ని తీసుకున్నారంటూ తెలిపారు. అయితే ఈ మార్పును పరిగణంలోకి తీసుకొని మరి 1968లో ఎన్నికల చిహ్నాల ఆర్డర్ ప్రకారం అందుకు సంబంధిత నియమాలు విధానాలకు అనుగుణంగానే గొడ్డలి గుర్తుని మా పార్టీకి చిహ్నంగా కేటాయించాలంటూ భారత ఎన్నికల కమిషన్ కు తాము అభ్యర్థిస్తున్నామంటు రాసుకొచ్చారు.


ఇందుకు సంబంధించి తమ అభ్యర్థనకు పార్టీ కార్యనియాక కమిటీ నుంచి అవసరమైన అన్ని పత్రాలను, అఫీడవిట్లను, తీర్మానాలను కూడా తాము జత చేశామంటూ రాసుకొచ్చారు.. మీ సానుకూల పరిశీలనల కోసమే తాము ఎదురుచూస్తున్నామంటూ ఈ విషయం పైన ఎలక్షన్స్ కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకున్న తాము సిద్ధంగానే ఉన్నామంటూ రాసుకొచ్చారు. ఈ సందర్భంగా శివకుమార్లేఖ రాయడంతో ఇప్పుడు వైరల్ గా మారింది మరి ఈ నిర్ణయంతో వైసీపీ పార్టీ భవిష్యత్తు ఏంటి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో కూడా ట్విట్టర్లో వైరల్ గా మారుతున్నది. మరి ఈ విషయంపై వైసీపీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: