ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పిఠాపురం గత ఎన్నికలలో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేయడంతో ఈ నియోజకవర్గ తెగ వినిపించింది. అయితే అప్పటికే అక్కడ టిడిపి నేతగా మంచి పేరు సంపాదించిన వర్మని కాదని పవన్ కళ్యాణ్ కి ఇవ్వడంతో చాలామంది టీడీపీ నేతలు కూడా నిరాకరించిన చివరికి వర్మ అనే అధిష్టానం ఎలా చెబితే అలా చేస్తానంటూ తెలియజేశారు. అలా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం వర్మ చాలానే కష్టపడ్డారు.


అయితే ఆనాడు వర్మ కు ఎమ్మెల్సీ పదవి కూడా ఇస్తామని చెప్పారు.కానీ ఇప్పటివరకు ఏ విధమైనటువంటి పదవి వర్మకు ఇవ్వలేదు. కానీ పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. వర్మ కూడా ఏ రోజు కైన ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని చాలా ఆశతో ఉన్నారు. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అవుతున్నాయని అందులో ఏదో ఒకచోట వర్మకి పదవి ఇస్తారని ఆయన అనుచరులు భావిస్తున్నారు. కానీ తాజాగా వినిపిస్తున్న ట్రాక్ ప్రకారం.. ఎమ్మెల్సీ పదవి ఇక వర్మకు దక్కదని భవిష్యత్తులో కూడా ఆశలు వదులుకోవాల్సిందే అన్నట్లుగా పెద్దలు చెప్పారని ప్రచారం జరుగుతోంది.


వర్మ కోరుకుంటే ఏదైనా రాష్ట్రస్థాయిలో నామినేటెడ్ పదవి మాత్రమే ఇస్తామని తెలియజేస్తున్నారట. అలా కాదు అనుకుంటే 2026 లో జరిగే జడ్పీ చైర్మన్ పదవిలలో ఆ పదవి ఇస్తామని చెబుతున్నారట.ఈ పదవులు తప్ప ఎమ్మెల్సీ మాత్రం ఇవ్వలేమంటూ తేల్చి చెబుతున్నారని వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ పిఠాపురం తన సొంత నియోజకవర్గంగా మార్చుకున్నారు. రానున్న రోజులలో ఎన్నికలలో ఆయన అక్కడి నుంచే కూడా పోటీ చేయబోతున్నారట. ఒకవేళ వర్మ కు ఎమ్మెల్సీ పదవి ఇస్తే పేరు పెరుగుతుందని జనసేన పార్టీ వైపు నుంచి కూడా ఒత్తిళ్లు వస్తున్నాయని విధంగా వినిపిస్తున్నాయట. వర్మకి జనబలం అర్హతలు అన్నీ ఉన్నప్పటికీ కూడా చట్టసభలలో అడుగు పెట్ట కోలేకపోతున్నారు. మరి ఈ విషయం పైన వర్మ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: