
అలాగే, బంగారుపాలెంలో మామిడి కాయలు రోడ్డుపై పోసిన సంఘటనను రైతులు, పోలీసులు స్క్రిప్టెడ్ డ్రామాగా విమర్శించారు. జగన్ ఈ డ్రామాలను సమర్థించారు, సినిమా డైలాగులు సెన్సార్ కానందున వాడవచ్చని , బాలకృష్ణ , పవన్ సినిమాలను నిషేధించాలని వాదించారు , ఇది విచిత్రంగా లేదా హాస్యాస్పదంగా అనిపించింది . జగన్ పోలీసు వ్యవస్థ పై తీవ్ర ఆరోపణలు చేశారు . డీజీపీ ని "మాఫియా డాన్" అని , సీఐలు కలెక్షన్లు చేసి ఎమ్మెల్యేలకు ఇస్తున్నారని అన్నారు . ఇవి వైసీపీ నాయకుల పై కేసుల నుంచి తప్పించుకు నే ఒత్తిడి వ్యూహంగా కనిపిస్తాయి . కేతిరెడ్డి, నల్లపురెడ్డి వంటి నాయకులపై కేసులు అన్యాయమని జగన్ వాదించారు, ఇలాంటి ఆణిముత్యాలతో ప్రెస్ మీట్ నడిచిపోయింది.
జగన్ చంద్రబాబు ప్రభుత్వం మూడేళ్లలో కూలిపోతుందని , తాను తిరిగి అధికారంలోకి వస్తానని అన్నారు . ప్రజలు తన వద్దకు వచ్చి బాధలు చెప్పడానికి వస్తున్నారని చెప్పారు , కానీ వారానికి రెండు రోజులు మాత్రమే తాడేపల్లిలో ఉంటూ, నిర్దిష్ట వ్యక్తులను కలుస్తున్నారని విమర్శలు ఉన్నాయి . ప్రతిపక్ష నాయకుడి గా జగన్ ప్రజల సమస్యల పై పోరాడకుండా , ఇలాంటి ప్రెస్ మీట్‌ల తో సంచలనం సృష్టించే ప్రయత్నం చేస్తున్నార ని విమర్శకులు అంటున్నారు. ఈ ప్రెస్ మీట్ వైసీపీ కి ప్రతికూల ప్రచారాన్ని తెచ్చిపెట్టింది , అలాగే ఇలాంటి ప్రెస్ మీట్లు పెడుతు ఏ విషయంలో ఆయన ప్రజల కోసం పని చేస్తున్నారో చెప్పుకోలేకపోతున్నారు.