ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కవిత అంటే ఎంత క్రేజ్ ఉండేదో మనందరికీ తెలుసు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ సీఎం అయ్యారు. ఆయన హయాంలో తన కూతురు కవిత తెలంగాణ జాగృతి పేరుతో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాన్ని బతుకమ్మ పండుగను దేశవ్యాప్తంగా చాటి చెబుతూ ఎంతో ప్రచారం చేశారు.. అలా రెండు పర్యాయాలు కవిత తిరుగులేని నాయకురాలిగా తెలంగాణలో నిలిచారు. ఎప్పుడైతే ఆమె లిక్కర్ స్కాం లో ఇరుక్కుందో అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి కాస్త దూరం అవుతూ వచ్చారు. అంతేకాదు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఆమెను దూరం పెడుతూనే ఉన్నారు.. దీంతో విసుగు చెందిన కవిత తెలంగాణ జాగృతి పేరుతో కొత్త నినాదంతో ముందుకు వెళ్తోంది.. 

అలాంటి ఈమె తాజాగా ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలు కీలక అంశాలపై మాట్లాడింది.. ఒక ఆడబిడ్డపై  పలువురు ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేసినా బీఆర్ఎస్ నుంచి ఎవరు కూడా మాట్లాడలేదని ఆవేదన వ్యక్తం చేసింది.. తన మీద ఆ వ్యక్తి చేసిన వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్ లోని  ఒక పెద్ద నాయకుడి కుట్ర ఉందని ఆరోపించింది. అంతేకాకుండా నల్గొండలో ఉండే ఒక బీఆర్ఎస్ నాయకుడు ఎగిరెగిరి పడుతున్నాడని, నల్గొండలో ఆయన ఒక్కడు మాత్రమే గెలిచి మిగతా సీట్ల ఓటమికి కారకుడు అయ్యాడు అని తెలియజేసింది.. అలాంటి ఆ లిల్లీ ఫుట్ నాయకుడు నా మీద మాట్లాడడం ఏంటంటూ సీరియస్ అయింది.. నిజానికి కవిత లిల్లీపుట్ అన్నది మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ని అని తెలుస్తోంది.

అయితే జగదీశ్ రెడ్డి ఒక ఇంటర్వ్యూ లో ఉన్నప్పుడు కవిత పరిస్థితి ఏంటి అని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆయన ఇలా సమాధానం ఇచ్చారు.. అసలు కవిత గురించి మాట్లాడడానికి ఏం లేదు.. ఆమె గురించి మాట్లాడుకోవడం కూడా టైం వేస్ట్.. కవితను బీఆర్ఎస్ లో పెద్దగా ఎవరూ పట్టించుకోరు.. ఒకవేళ ఆమె పార్టీకి చెందిన వ్యక్తిగా ఉంటే ఎమ్మెల్సీ మాత్రమే.. కానీ పార్టీ దాటి బయటకు వెళ్తే ఏ విలువ ఉండదని జగదీశ్ రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే ఆయన అన్న మాటలకు కవిత చాలా హర్ట్ అయిపోయి తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పై విరుచుకుపడుతూ లిల్లీ ఫుట్ తో పోల్చింది. ప్రస్తుతం కవిత మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: