
ఈ చర్చకు మరింత బలం చేకూరుస్తూ ఇటీవల కృష్ణా జిల్లా లీగల్ సెల్ ప్రతినిధులతో జగన్ సమావేశమైనప్పుడు ఒక దృశ్యం కనిపించింది. ఆ సమావేశంలో జగన్ పక్కన ఇద్దరు ప్రముఖ న్యాయవాదులు నిలబడ్డారు. ఆయన కుడివైపున లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, ఎడమవైపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఉన్నారు. వీరిద్దరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే.
ఈ సంఘటనను ఉదహరిస్తూ, జగన్ తన పాలనలోనూ, పార్టీ వ్యవహారాల్లోనూ తన సామాజిక వర్గానికే అధిక ప్రాధాన్యత ఇచ్చారన్న వాదనలు మళ్లీ తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా పార్టీలో కీలక పదవులు, ప్రభుత్వంలో ముఖ్యమైన స్థానాలు, నామినేటెడ్ పోస్టులు వంటి వాటిలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి ఎక్కువ అవకాశాలు కల్పించారని ప్రతిపక్షాలు గతంలో విమర్శించాయి.
అయితే, జగన్ వర్గీయులు మాత్రం ఈ విమర్శలను తోసిపుచ్చారు. పార్టీలో సమర్థత, విశ్వసనీయత ఆధారంగానే పదవులు ఇచ్చారని, కులం ప్రాతిపదికన కాదని వారు వాదిస్తారు. కానీ, లీగల్ సెల్ సమావేశం వంటి సంఘటనలు విమర్శకులకు మరింత ఆయుధంగా మారుతున్నాయి. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో కుల ప్రాతిపదికన జరుగుతున్న చర్చలకు మరింత ఊతమిస్తున్నాయి.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు