
అయితే అతనిపైన డైరెక్ట్ గా దాడి చేయకుండా ఫస్ట్ కిడ్నాప్ చేసి ఆ తర్వాత చేతులకు సంఖ్యలు వేసి మరి సరిహద్దు వైపు తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేశారట. ఆ సమయంలోనే మారక్ వారి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేశారు. దీంతో ఆ ముఠా అతనిపైన కాల్పులు కూడా జరిపారు. ఆ బాధితుడు వేగంగా పరిగెత్తి దగ్గరలో ఉన్న ఒక ఇంట్లో తలదాచుకొని ప్రాణాలను రక్షించుకున్నారు. అయినప్పటికీ కూడా ఆ కిడ్నాప్ ముఠా తనను చంపేందుకు ప్రయత్నించారని తన గొంతు కోసి ఉంటారని మారక్ ఆరోపణలు చేశారు..
అయితే ఈ ఘటన గురించి అక్కడ వెంటనే బిఎస్ఎఫ్ అధికారులకు మేఘాలయ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే వారు ఆపరేషన్ మొదలుపెట్టారు. భారతీయుల పైన దాడి చేసిన వారు బంగ్లాదేశ్ వైపుగా వెళుతూ ఉండగా పోలీసులు గాల్లోకి రెండు కాల్పులు జరపడంతో వారు ఆగిపోయారు. దీంతో అక్కడ ఉన్న భద్రతా దళాలు వారిని చుట్టుముట్టి పట్టుకున్నారు.. అలాంటి సమయంలోనే గ్రామస్తులు మరొక వ్యక్తి అనుమానంగా తిరుగుతూ ఉండగా వారిని పట్టుకున్నారు. దీంతో పోలీసులు వారిని పరిశీలించగా వారి దగ్గర ఆయుధాలు, డబ్బు, మొబైల్స్ ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ నలుగురు విషయానికి వస్తే.. మోఫాన్ రెహమాన్, జాంగిర్ ఆలోమ్, సయీమ్ హుస్సేన్ , మొరుపుర్ రెహమాన్ గా గుర్తించారు. ఇక మిగిలిన వారి కోసం బిఎస్ఎఫ్ , పోలీసు దళాలు గాలింపు చర్యలు చేస్తున్నారు.