
మొత్తం ఐదు రకాల బస్సులలో మహిళలు ఉచితంగానే ప్రయాణించవచ్చట.
అందులో 1). పల్లె వెలుగు, 2) సిటీ ఆర్డినరీ, 3) మెట్రో ఎక్స్ప్రెస్, 4). అల్ట్రా పల్లె వెలుగు, 5) ఎక్స్ప్రెస్ బస్సులు కూడా ఉన్నాయి.
ముఖ్యంగా విద్యార్థులు, మహిళా ఉద్యోగులు, సాధారణ మహిళలు , ట్రాంజెండర్లు సైతం ఆధార్ కార్డు, లేకపోతే ఓటర్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ మొత్తం 11 రకాల గుర్తింపు కార్డులను ఏదో ఒకటి ఉపయోగించుకొని ఉచిత బస్సులో ప్రయాణించవచ్చు. అలాగే తిరుమల తిరుపతి మధ్య కొండపైన తిరిగేటువంటి సప్తగిరి బస్సులలో ఈ ఉచిత ప్రయాణం వర్తించదట.
అలాగే నాన్ స్టాప్ బస్సులు, పలు రాష్ట్రాల మధ్య తిరిగి అంతరాష్ట్ర బస్సులలో ఈ ఉచిత బస్సు ప్రయాణం వర్తించదు.
సూపర్ లగ్జరీ, అల్ట్రా లగ్జరీ, సప్తగిరి ఎక్స్ప్రెస్, ఇంద్ర, అమరావతి ఏసీ వంటి లగ్జరీ బస్సులలో ఈ ఉచిత ప్రయాణం అనుమతించబడదు.
ఉచిత బస్సులలో సీసీ కెమెరాలు కండక్టర్లకు బాడీ ఓర్న్ కెమెరాలు కూడా ఉంటాయట. ఎలాంటి సంఘటనలు జరిగినా కూడా డ్రైవర్, కండక్టర్ల బాధ్యులుగా ఉంటారు.
బస్సు సామర్థ్యాన్ని మించి మహిళలు ఎక్కడానికి వీలు లేదు. అయితే ఉచిత బస్సులలో కేటాయించిన సీట్లలో 85% మహిళలకే అవకాశం ఉంటుంది. అలాగే మహిళలు జీరో ఫర్ టికెట్ ని కూడా తీసుకోవాలి. ఆగస్టు 15 నుంచి ఈ పథకం అందుబాటులోకి వస్తుంది.