ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఎంట్రీతో పరిస్థితులు పూర్తిస్థాయిలో మారిపోయాయి. టెక్నాలజీ రంగంలో ఏఐ సృష్టిస్తున్న సంచలనాలు అన్నీఇన్నీ కావు. అయితే ఏఐ వ్యవస్థల వల్ల భవిష్యత్తులో ఊహించని స్థాయిలో ప్రమాదాలు ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐగా గుర్తింపును సంపాదించుకున్న జాఫ్రీ హింటన్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

భవిష్యత్తులో ఏఐ మానవాళిని తుడిచిపెట్టే అవకాశం ఉందని జాఫ్రీ హింటన్ అన్నారు.  దీనిని నివారించాలంటే  ఎమోషన్స్ కలిగి ఉండే విధంగా ఏఐలో మార్పులు చేయాల్సిన అవసరం అయితే ఉందని జాఫ్రీ హింటన్ చెప్పుకొచ్చారు.  మానవుల సంరక్షణ విషయంలో  అవగాహనా కల్పించాల్సిన అవసరం అయితే ఉందని ఆయన తెలిపారు.  ప్రస్తుతం ఎఐలు మానవుల కంట్రోల్ లోనే ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు.

అయితే ఎప్పటికీ ఇలాగే  మాత్రం చెప్పలేమని ఆయన వెల్లడించారు.  భవిష్యత్తులో ఏఐ మానవ మేధస్సును అధిగమిస్తే   మనం పెట్టిన పరిమితులను దాటగలిగే మార్గాలను అది అన్వేషిస్తుంది జాఫ్రీ హింటన్ పేర్కొన్నారు.  తాజాగా ఒక ఏఐ రహస్యాలను బయటకు చెప్పేస్తానని బెదిరించిన ఉదంతాన్ని ఈ సందర్భంగా గుర్తు చేయడం జరిగింది.  

భవిష్యత్తులో మానవులు ఇలాంటి ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన తెలిపారు.  అందుకే తల్లీబిడ్డల రీతిలో ఎమోషన్స్ కలిగి ఉండేలా ఏఐ వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఏఐతో  ప్రమాదాలు ఉన్నా  ఆరోగ్య రంగంలో దాని వినియోగంతో ఎన్నో  ప్రయోజనాలు పొందవచ్చని జాఫ్రీ హింటన్ వెల్లడించారు.  జాఫ్రీ హింటన్ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి:

ai