తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి ఎప్పుడైతే సీఎం అయ్యారో అప్పటినుంచి ఏదో ఒక ఇబ్బంది కలుగుతూనే ఉంది. రేవంత్ రెడ్డిని అధిష్టానం ఆ పదవి నుంచి త్వరలోనే పీకేస్తుందని ఆయన సీఎం సీటు అధిరోహించినప్పటి నుంచి అంటూనే ఉన్నారు. అంతేకాదు డిసెంబర్ లో ఆయన పని పూర్తిగా ముగుస్తుందని మీడియా ఎదుట సొంత పార్టీ వాళ్లు ఇతర ప్రతిపక్షం  వాళ్ళు కూడా అంటున్నారు.. అయితే తాజాగా సీఎం సీటు గురించి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఏదైనా పదవి కోసం పది మంది పోటీ పడతారు. అందులో ఆ పదవి ఒక్కరికే వస్తుంది. మిగిలిన తొమ్మిది మంది నిరాశ చెందుతారు. అలాంటివారు జనాల్లో అపోహలు సృష్టిస్తే  రాష్ట్రానికి, దేశానికి నష్టం అంటూ క్రెడాయి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.. మరి సీఎం రేవంత్ రెడ్డి అలా అనడానికి తప్పనిసరిగా ఏదైనా కారణం ఉండే ఉంటుంది.. 

అంటే సీఎం మార్పు అనే విషయం ఆయన వరకు కూడా చేరే ఉంటుంది.. అందుకే రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడి ఉంటారు. సీఎం మార్పు జరుగుతుందని బీఆర్ఎస్, బిజెపి నేతలు ఎప్పటినుంచో ప్రచారం చేస్తూ వస్తున్నారు. దీనివల్ల రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి కూడా ముఖ్యమంత్రిని నమ్మి ఎవరూ రావడం లేదు. రియల్ ఎస్టేట్ వర్గాల్లో అయితే తీవ్రమైన అనిచ్ఛితి  ఏర్పడింది. ఫ్యూచర్ సిటీలో భాగంగా పెట్టుబడులు కూడా రావడం లేదు. ఇవన్నీ గమనించిన సీఎం  రేవంత్ రెడ్డి వ్యాపారవేత్తల సమావేశంలో తన ముఖ్యమంత్రి పదవి గురించి మాట్లాడడం చర్చనీయాంశమైంది. అయితే ఇదే తరుణంలో  డిసెంబర్ లో సీఎం మార్పు ఉంటుందని బిజెపి నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మీడియా ముఖంగానే మాట్లాడారు. ఈ న్యూసే ఒక ఊహాగానంగా మిగిలిపోయిందని సీఎం అభిప్రాయపడ్డారు.

అయితే ఇదే ప్రచారాన్ని బిజెపి, బీఆర్ఎస్ వారి అవసరాలకు వాడుకుంటూ రాష్ట్రంలో ఇబ్బందులు ఎదురయ్యేలా చేస్తోంది. అయితే డిసెంబర్ వచ్చేసరికి బీఆర్ఎస్, బిజెపి కలిసిపోతుందని రేవంత్ రెడ్డిపై అసంతృప్తితో ఉన్నటువంటి నేతలు అంతా ఆ పార్టీలోకి వెళ్తారనే ప్రచారం జోరందుకుంది. అయితే ఇదే విషయం సీఎం రేవంత్ రెడ్డికి చేరి ఉంటుంది. అందుకే రేవంత్ రెడ్డి సీఎం సీటు మార్పు గురించి మాట్లాడడం  విపరీమైన చర్చకు దారి తీసింది. అందుకే ఆయన ఈ సీటు మార్పుపై క్లారిటీ కూడా ఇచ్చారు. ఏది ఏమైనప్పటికీ  రాజకీయాల్లో మార్పు రావాలి అంటే డిసెంబర్ వరకు వేచి చూడాలని నేతలంతా అంటున్నారు. మరి అప్పటివరకు రాష్ట్రంలో మార్పు జరుగుతుందా లేదా అనేది ముందు ముందు తెలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: