తెలుగు రాజకీయాలు – తెలుగు సినిమాలు అనే రెండు వేర్వేరు రంగాలు ప్రస్తుతం కలగాపులగం అవుతున్నాయి. ఎవరు రాజకీయ నేతలు, ఎవరు స్టార్ హీరోలు అన్న తేడా చెరిగిపోతోంది. దాంతో ఒక పార్టీకి నష్టం అయితే, మరోవైపు సినీ హీరోల ఇమేజ్‌కీ ఇబ్బందులు వస్తున్నాయి. ఈ క్రాస్ కనెక్షన్స్ వల్లనే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ చుట్టూ పెద్ద రాజకీయ హంగామా నడుస్తోంది. జూనియర్ చుట్టూ రాజకీయ వలయం .. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సినీ రంగంలో సూపర్ స్టార్ స్థాయికి ఎదిగారు. ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా "ఆర్‌ఆర్‌ఆర్" తరహా సినిమాలతో కీర్తి పొందారు. ఇలాంటి సమయంలో ఆయనను రాజకీయాల్లోకి లాగడం మొదలైంది. ఇటీవల అనంతపురం ఎమ్మెల్యే జూనియర్ పై చేసిన కామెంట్స్ పెద్ద దుమారం రేపాయి. ఫ్యాన్స్ ఆగ్రహంతో రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. ఎమ్మెల్యే ఇంటి ఎదుటే ప్రదర్శనలు చేసి తమ కోపాన్ని వ్యక్తం చేశారు. “మా హీరో మీద మాటలు అనొద్దు.. మాతో తగవు పడొద్దు” అంటూ గట్టిగా హెచ్చరించారు.


వైసీపీ మద్దతు… మరో ట్విస్ట్! .. అదే సమయంలో వైసీపీ నాయకులు, సోషల్ మీడియా యాక్టివిస్టులు మాత్రం జూనియర్ కి మద్దతుగా నిలబడ్డారు. జగన్, జూనియర్ త్వరలో కలుస్తారని పోస్టులు పెడుతూ మరింత హీట్ క్రియేట్ చేస్తున్నారు. “జూనియర్ మాది, ఆయనకే మా అండ” అని బహిరంగంగానే చెబుతున్నారు. దీంతో జూనియర్ నిజంగానే వైసీపీ వైపు మొగ్గుతారా? అన్న చర్చ మొదలైంది. నిజమెంత? .. అసలు వైసీపీజూనియర్ కాంబినేషన్ అనేది ఇంపాజిబుల్ అని రాజకీయ విశ్లేషకులు తేల్చేశారు. ఎందుకంటే జూనియర్ కి రాజకీయ ప్రవేశం అంటే తన తాత ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీనే మొదటి ఆప్షన్. ఒకవేళ అక్కడ ఇబ్బందులు వస్తే, భవిష్యత్తులో సొంతంగా పార్టీ పెట్టే అవకాశం ఉంది. కానీ ఇప్పటికీ ఆయన చూపు పూర్తిగా సినిమాలపైనే ఉందని అందరూ ఒప్పుకుంటున్నారు.



పోస్టుల వార్ – ఫ్యాన్స్ టైమ్ పాస్ .. జూనియర్ ప్రస్తుతం కేవలం 40 ఏళ్ల వయసులో ఉన్నారు. ఇంకో రెండు దశాబ్దాలు సక్సెస్ ఫుల్ ఫిల్మ్ కెరీర్ నడిపే పవర్ ఉంది. ఈ స్టేజ్ లో ఆయన రాజకీయాల్లోకి వెళ్లడం అంటే కేవలం గాసిప్స్ మాత్రమే. కానీ సోషల్ మీడియా యాక్టివిస్టులు మాత్రం ఊహాగానాలతో నెట్ దంచేస్తున్నారు. మొత్తానికి, జూనియర్ ఎన్టీఆర్ చుట్టూ రాజకీయం ముసురుకున్నా… ఆయన మాత్రం చాలా మెచ్యూర్డ్, క్లియర్ టార్గెట్ ఉన్న వ్యక్తి. తన కెరీర్ పైనే ఫోకస్ పెట్టారు. కాబట్టి జగన్జూనియర్ మీట్ అన్నది కేవలం ఇంపాజిబుల్ రూమర్ అని చెప్పక తప్పదు. ఈ సోషల్ మీడియా వార్ అన్నీ ఫ్యాన్స్ టైం పాస్ మాత్రమే!

మరింత సమాచారం తెలుసుకోండి: