గతంలోనే వైసిపి నేతలు, వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అన్నిటిని ఆపేస్తారని పథకాలు ఏవి ఇవ్వరు అంటూ కూడా చెప్పారు. ఇప్పుడు అన్నట్టుగానే పింఛన్ల వ్యవహారం నిజం కాబోతోందని వైసీపీ నేతలు తెలుపుతున్నారు. గత రెండు మూడు రోజుల నుంచి ఏపీలో పింఛన్లు తీసేస్తున్నారనే విధంగా వినిపిస్తున్నాయి. కానీ తీసేసేటప్పుడు చంద్రబాబు ఒక స్ట్రాటజీని పాటిస్తున్నట్లు కనిపిస్తోంది. అనర్హులను మాత్రమే తొలగిస్తున్నామని చెబుతున్నారు. మరి కొంతమంది అర్హత లేకుండా తీసుకున్నారంటూ చాలామంది పింఛన్లు తీసేస్తున్నట్లు వినిపిస్తున్నాయి.



ఇటీవలే నాలుగున్నర లక్షల మంది పెన్షన్లను తీసివేసి.. ఎంక్వయిరీ చేసి తీసేసాము.. ఆ తీసేసిన వారంతా కూడా అనర్హులు వారికి అన్యాయంగా ఇచ్చారనేటువంటిది స్వయంగా సీఎం చంద్రబాబే తెలిపారు. అయితే ఎవరో ఒక వ్యక్తి చొక్కా పైన చెయ్యి లేకుండా నటించినట్టు ఉన్న వీడియోని మాత్రమే చూపిస్తున్నారు కానీ.. మిగతా వాళ్లది నిజంగానే అంగవైకల్యం ఉన్నవాళ్లను కూడా తీసేస్తున్నారన్నటువంటి విషయాన్ని మాత్రం తెలియనివ్వలేదు.


తాజాగా కృష్ణా జిల్లాలో ఒక అరుదైన సంఘటన చోటు చేసుకుంది.. దివ్యాంగుల పింఛన్ల విషయంలో ఒక మహిళ కృష్ణాజిల్లాలోని కోడూరు పంచాయతీకి చెందిన భూపతి నాగమణి అనే అమ్మాయి పింఛన్ని తొలగిస్తూ నోటీసు ఇచ్చారట. ఆ  మహిళా ఒక్కరే ఉన్నారు.. దివ్యాంగుల పెన్షన్ రూ.6000 వచ్చేది.. అయితే సదరం సర్టిఫికెట్లు 40% వరకు అంగవైకల్యం ఉన్నట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. కానీ ఇటీవలే వైద్య పరీక్షలు చేసిన వారు 40 శాతం లోపే ఉందంటూ పెన్షన్ ని తీసివేశారు. అధికారులు ఇచ్చినటువంటి నోటీసులతో కోడూరు సచివాలయానికి వెళ్లిన నాగమణి.. అవును నీకు కళ్ళు బాగానే కనిపిస్తున్నాయి కదా డాక్టర్లు చెప్పారని తెలిపారట.. ఆమె తనకి ఒక కన్ను మాత్రమే ఉన్నది రెండవది పెట్టుడు కన్ను అంటూ కన్నును కూడా తీసుకొచ్చినటువంటి సంఘటన ఇప్పుడు అందరిని కలిసి వేస్తోంది. సీఎం చంద్రబాబును, డిప్యూటీ సీఎం చంద్రబాబును వేడుకుంటున్నట్లు ఒక వీడియో వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: