
సీఎం చంద్రబాబు ఎన్నికల ముందు ఉద్యోగులకు హామీ ఇచ్చిన వాటిని నెరవేర్చారని కండక్టర్లు, డ్రైవర్లు, గ్యారేజీ ఉద్యోగాలతో పాటుగా సూపర్ వైజర్ కేడర్ వరకు అర్హులు ఉన్నటువంటి వారందరికీ కూడా ఉద్యోగాలలో ప్రమోషన్స్ వస్తాయని తెలిపారు. దీంతో సుమారుగా 3000 మంది ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు వచ్చే అవకాశం ఉన్నట్లు వినిపిస్తోంది. ప్రస్తుతం పదోన్నతుల ద్వారా కింద స్థాయి ఉద్యోగులకు మరింత ఆర్థిక లబ్ది కలుగబోతోంది. ప్రమోషన్స్ విషయంలో చంద్రబాబు గుడ్ న్యూస్ తెలపడంతో ఆర్టీసీ ఉద్యోగులు కూడా సీఎం చంద్రబాబు పైన ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు.
ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు విషయం పైన కృషి చేసినటువంటి ఎంప్లాయిస్ యూనియన్ నేతలకు అలాగే రవాణ శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నారు ఆర్టీసీ ఉద్యోగులు. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమోషన్స్ కు సంబంధించి జీవో ని సెప్టెంబర్ 1 నుంచి అమలు చేయబోతున్నారు. సీఎం చంద్రబాబు ఒకవైపు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూనే మరొకవైపు ఉద్యోగులకు సంబంధించిన అన్ని విషయాలలో కూడా పూర్తిగా అమలు చేసేలా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు. ఉద్యోగులలో ఒత్తిడి భారం తగ్గించేందుకే రాబోయే రోజుల్లో మరిన్ని ఉద్యోగాలను కూడా భర్తీ చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఆర్టీసీలో భర్తీ ఉద్యోగాలు చేయడమే కాకుండా కొత్త బస్సులను తీసుకురాబోతున్నారు.