
కేటీఆర్ మాటల్లో, మాజీ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఒకప్పుడు రైలుకింద తలపెట్టి మరణిస్తాను అని చెప్పి పార్టీ మారదని ప్రకటించారు. అయితే ఇప్పుడు అభివృద్ధి కోసం పార్టీ మారతున్నట్లు వాదిస్తున్నారని ఆయన ఆరోపించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమా లేదా వ్యక్తిగత ప్రయోజనాల కోసమా ఈ మార్పు జరుగుతోందని ప్రశ్నిస్తూ, ఇటువంటి నాయకుల చర్యలు ప్రజల అభివృద్ధిని ప్రభావితం చేస్తాయని కేటీఆర్ అన్నారు. పార్టీ మారిన పదకొంది మంది ఎమ్మెల్యేల స్థానాలకు ఉప ఎన్నికలు జరగాలని, ఇది రాజకీయ నీతి ప్రకారం అవసరమని ఆయన పేర్కొన్నారు.
సుప్రీం కోర్టు పార్టీ ఫిరాయింపులపై తీవ్రంగా ఆలోచిస్తోందని, ఇటువంటి చర్యలు రాజకీయ వ్యవస్థను దెబ్బతీస్తాయని ఆయన హెచ్చరించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేరుగా సవాలు విసిరిన కేటీఆర్, పదకొంది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేసి ఎన్నికలకు ఎదుర్కొనాలని కోరారు. ఈ ఆరోపణలు రాజకీయ వ్యవస్థలో అవినీతిని ఎత్తిచూపుతున్నాయని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ సవాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వీకరిస్తారా అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు