గ్రూప్-1 డీఎస్పీ ఉద్యోగాల ఎంపిక విషయంలో తాజా సంఘటన కొత్త వివాదానికి దారితీసింది. ఒకే హాల్‌ టికెట్ నంబర్‌తో ఇద్దరు అభ్యర్థులకు కేటాయింపు జరిగిందన్న ప్రచారంపై టీజీపీఎస్సీ స్పష్టతనిచ్చింది. దొంత నిశ్రిత అనే అభ్యర్థి నకిలీ హాల్‌టికెట్‌ సమర్పించి, డీఎస్పీ ఉద్యోగం పొందినట్లు తప్పుడు ప్రచారం చేసినట్లు కమిషన్‌ తేల్చింది. ఆమె ప్రిలిమ్స్‌లోనూ అర్హత సాధించలేదని, 240909088 నంబర్‌ హాల్‌టికెట్‌ యెల్లబోయిన రుచితకు మాత్రమే చెందినదని వెల్లడించింది.

టీజీపీఎస్సీ ప్రకటన ప్రకారం, నిశ్రిత సమర్పించిన హాల్‌టికెట్‌ నకిలీదని, ఆమె వాదనలు అవాస్తవమని స్పష్టం చేసింది. ఇద్దరికి ఒకే హాల్‌ టికెట్‌ జారీ అయ్యిందన్న వాదనలను కొట్టిపారేసింది. ఇలాంటి తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అభ్యర్థులు ఇటువంటి వదంతులను నమ్మవద్దని సూచించింది.ఈ ఘటన గ్రూప్-1 ఎంపిక ప్రక్రియలోని లోపాలను బయటపెట్టింది. ఇంతటి ప్రాధాన్యత గల పోస్టుల ఎంపికలో జాగ్రత్తలు తీసు కోవాల్సిన అవసరం ఉంది.

అయితే, ఈ వ్యవహారంలో పలు సందేహాలు తలెత్తుతున్నాయి. నియామక ప్రక్రియలో శాఖల అధికారులు నిబంధనలను పాటించడం లేదని, ప్రక్రియలో లోపాలున్నాయని నిరుద్యోగులు, జేఏసీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.రిక్రూట్‌మెంట్‌ సంస్థలు ఎంపికైన అభ్యర్థుల వివరాలను సంబంధిత శాఖలకు పంపి, నియామక పత్రాలు జారీ చేయాలి. కానీ, ఈ ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నట్లు తాజా ఉదంతం సూచిస్తోంది. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగ కుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిరుద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌ 94905 20108 కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: