
తీవ్ర వాయుగుండం కారణంగా రైలు సర్వీసులు, రోడ్డు మార్గాలు దెబ్బతినే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఒడిశా తీరంలోని పోర్టులన్నింటికీ మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ పరిస్థితుల్లో రవాణా వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. స్థానిక యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈదురుగాలులు, భారీ వర్షాల వల్ల పంట నష్టం, ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉంది. వాతావరణ శాఖ హెచ్చరికలను ప్రజలు పాటించాలని కోరింది. అత్యవసర సేవలు సిద్ధంగా ఉంచారు.ప్రభుత్వం ఈ వాయు గుండం ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతోంది.
సహాయక చర్యల కోసం స్థానిక అధికారులు, విపత్తు నిర్వహణ బృందాలు సమన్వయంతో పని చేస్తున్నాయి. ప్రజలు అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మి, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచనలు జారీ చేశారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు