దిల్లీలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దేశ సేవలో ఎల్లప్పుడూ ముందుంటారని కొనియాడారు. సంఘం పేదల జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రూ.100 నాణెం, పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు. సంఘం నీతి, నిస్వార్థ సేవ ద్వారా దేశ అభివృద్ధికి తోడ్పడుతోందని, సమాజంలో చైతన్యం తెస్తోందని అన్నారు.ఆర్ఎస్ఎస్ నదీ ప్రవాహంలా సమాజంలో పచ్చదనం నింపుతోందని మోదీ వివరించారు. విద్య, వైద్యం, రైతుల సంక్షేమం కోసం సంఘం అనేక సేవా కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు.

భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో సంఘం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త పనిలో దేశ ప్రాధాన్యత కనిపిస్తుందని, ఇది నేషన్ ఫస్ట్ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని అన్నారు.ప్రతి పౌరుడు చైతన్యవంతుడైతేనే దేశం అభివృద్ధి సాధిస్తుందని మోదీ అభిప్రాయపడ్డారు. ఆలోచనలు, కార్యాచరణ జీవితాన్ని నిర్దేశిస్తాయని, క్రమశిక్షణ, చిత్తశుద్ధి, కఠోర శ్రమ ద్వారా మార్పులు సాధ్యమని చెప్పారు. సమాజంలో శారీరక, మానసిక, సామాజిక మార్పుల కోసం సంఘం పనిచేస్తోందని వివరించారు. సమాజ శ్రేయస్సు కోసం ప్రతి పౌరుడు బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.

హైదరాబాద్, గోవాలో అణచివేతలను ఎదిరించి సంఘ కార్యకర్తలు పోరాటం చేశారని మోదీ గుర్తు చేశారు. అనేకమంది జైళ్లకు వెళ్లి, కష్టాలు ఎదుర్కొన్నా సిద్ధాంతాలను వదలలేదని కొనియాడారు. సమాజం బాగుపడినా, లోపాలు తలెత్తినా, ప్రతి పౌరుడు బాధ్యత వహించాలని పేర్కొన్నారు. దేశ ప్రజలంతా భుజం భుజం కలిపి ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.


వాట్సాప్ నెంబ‌ర్‌ 94905 20108 కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి:

RSS