ఆంధ్రప్రదేశ్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యుల సమ్మె ఐదో రోజు కొనసాగుతోంది. సెప్టెంబర్ 29 నుండి ప్రారంభమైన ఈ ఆందోళనలో దాదాపు 2,800 మంది వైద్యులు పాల్గొంటున్నారు. ఇది 1,142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఔట్‌పేషెంట్, ఎమర్జెన్సీ సేవలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రోజుకు లక్షలాది మంది గ్రామీణ, ఆదివాసీ ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వైద్యుల సంఘం ప్రకారం, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ఇన్-సర్వీస్ కోటా 20 శాతానికి పెంచాలని, క్లినికల్ బ్రాంచెస్‌లో అన్ని 15 రంగాలకు ఈ కోటా వర్తింపజేయాలని ప్రధాన డిమాండ్లు.

గతేడాది 20 శాతం ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు 15 శాతానికి తగ్గించడం ఈ ఆందోళనకు కారణమైంది. ఆదివాసీ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు సంచార ఆరోగ్య సేవల డిమాండ్లు కూడా ఉన్నాయి. గ్రామీణ ఆరోగ్య వ్యవస్థను మరింత బలహీనపరుస్తోంది.ప్రభుత్వం ఈ సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉందని ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. వైద్యుల డిమాండ్లను ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లించి తగిన నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఇన్-సర్వీస్ కోటా, ఉద్యోగ సేవల డిమాండ్లకు పరిష్కారం చూపుతామని, క్లినికల్ బ్రాంచెస్‌లో 15 శాతం కోటాను అన్ని రంగాలకు విస్తరించే అవకాశం ఉందని తెలిపారు. టైమ్-బౌండ్ ప్రమోషన్లు, ఆదివాసీ భూ.తి, సంచార చికిత్స అలవెన్స్‌లపై చర్చించి సూచనలు ఇవ్వడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని మంత్రి పేర్కొన్నారు. ఈ కమిటీ జీవో 85ను పరిశీలించి, వైద్యుల సేవలు మెరుగుపరచే ప్రతిపాదనలు సమర్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వైద్యుల సమస్యలు పరిష్కరించడం ద్వారా రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేస్తామని తన నిర్ణయాన్ని పునరుద్ఘాటించారు.

వాట్సాప్ నెంబ‌ర్‌ 94905 20108 కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: