
రుషికొండ ప్యాలెస్‌లను సాంస్కృతిక కేంద్రాలుగా, పర్యాటక ప్రమోషన్ కోసం, పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య విధానాల కోసం ఉపయోగించే అవకాశాలపై సలహాలు అందించాలని ప్రభుత్వం కోరింది.రుషికొండ పరిసర ప్రాంతాన్ని పర్యావరణ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు సూచనలు కోరినట్లు పర్యాటక శాఖ తెలిపింది. ఈ నెలలో ఉదయం 11 గంటలకు విజయవాడ ఆటోనగర్‌లోని స్టాలిన్ కార్పొరేట్‌లో ఏపీ టూరిజం అథారిటీ కార్యాలయంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థలతో సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో ప్రముఖ ఆతిథ్య గ్రూపులు, సంస్థలు పాల్గొని రుషికొండ భవనాల వినియోగంపై ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ) చేయవచ్చని అథారిటీ పేర్కొంది. ఈ సమావేశం ద్వారా వచ్చే అభిప్రాయాలు రాష్ట్ర ఆర్థిక, సాంస్కృతిక అభివృద్ధికి దోహదపడతాయని అధికారులు ఆశిస్తున్నారు.పౌరులు, సంస్థలు అందించిన సూచనలను మంత్రుల బృందం సమీక్షిస్తుందని ఆమ్రపాలి తెలిపారు. ఈ సమీక్ష ఆధారంగా రుషికొండ ప్యాలెస్‌ల వినియోగంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని ఆమ్రపాలి స్పష్టం చేశారు.
ఈ ప్రక్రియ పారదర్శకంగా, ప్రజల సహకారంతో జరగాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రుషికొండ భవనాలను పర్యాటక, సాంస్కృతిక కేంద్రంగా మార్చడం ద్వారా రాష్ట్ర ఆదాయ వనరులను పెంచే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ చర్యలు విశాఖ ప్రాంతాన్ని ఆర్థిక, సాంస్కృతిక హబ్‌గా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.రుషికొండ ప్యాలెస్‌ల వినియోగం రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు స్థానిక ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు