
అయితే ఇలాంటి సందర్భంలోనే జడేసే భార్య ఏం చదువుకుందనే విషయం వైరల్ గా మారింది. రివాబా జడేజా 1990లో జన్మించారు. ఈమె తల్లి తండ్రులు హర్దేవ్ సింగ్ సోలంకి, ప్రపుల్లాబా. రివాబా రాజ్ కోట్ లోని ఆత్మీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. రాజపుత్ వర్గానికి చెందిన ఈమె బిజెపి పార్టీలో చేరడానికి ముందు 2018లో కర్ణ సేన అనే మహిళా విభాగానికి చీఫ్ గా బాధ్యతలను చేపట్టింది. ఇక తన చదువు పూర్తి అయిన తర్వాత శ్రీ మాతృశక్తి అనే చారిటబుల్ సంస్థను ప్రారంభించి ఎంతోమంది మహిళలకు అండగా చేయూతగా నిలిచింది..
రవీంద్ర జడేజాతో వివాహం కాకముందే అతడి సోదరి నైనా, రివాబా ఇద్దరు మంచి స్నేహితులు. రవీంద్ర జడేజాను ఒక పార్టీలో కలిసిన తర్వాత వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అలా 2016 ఏప్రిల్ 17న జడేజా, రివాబా ఇద్దరు వివాహం చేసుకున్నారు. వీరికి నిధ్వాన కుమార్తె కూడా కలదు. 2019లో బిజెపి పార్టీలో చేరిన ఈమె 2022 గుజరాత్ జామ్ నగర్ ఉత్తర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచింది ఇప్పుడు ఆమె విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలను చేపట్టింది. స్టార్ క్రికెటర్ భార్య, ఎమ్మెల్యే అయ్యుండి కూడా సింపుల్ గా ఉండడానికే ప్రయత్నిస్తుంది.