
హరితేజ మాట్లాడుతూ తనకు అల్లు అర్జున్ సార్ అంటే చాలా ఇష్టమని.. తన లైఫ్ లో ఎప్పుడూ కూడా డైటింగ్ చేయలేదని, కానీ అల్లు అర్జున్ నటించిన డీజే సినిమాలో తనకు అవకాశం వచ్చినప్పుడు అల్లు అర్జున్ ని కలుస్తానని తెలిసి ఒక 15 రోజులు ముందు నుంచే లిక్విడ్ డైట్ చేసి చాలా సన్నబడడానికి ట్రై చేశాను. ముఖ్యంగా బన్నీ కి బాగా కనపడాలనుకునే దాన్ని షూటింగ్ ముందు రోజు రాత్రి అసలు నిద్ర పట్టలేదు. అయితే ఆ మరుసటి రోజు షూటింగ్ సెట్లోకి వెళ్ళగానే నేను మీ బిగ్ బాస్ చూసాను మీరు అంటే మా ఇంట్లో వాళ్లకి చాలా ఇష్టం ఇష్టమని చెప్పగానే షాక్ అయ్యాను అని తెలిపింది హరితేజ.
గతంలో కూడా హరితేజ ఒక్క క్షణం అనే సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి హోస్టుగా కూడా చేసింది. అయితే ఈవెంట్ కి అల్లు అర్జున్ గెస్ట్ గా వచ్చారు. ఆ సమయంలో కూడా హరితేజ ఆర్టిస్టుగా నాకు చాలా ఇష్టం ఈ తెలుగమ్మాయి అంటూ తెలిపారు. అదే సందర్భంలోనే తన ఫేవరెట్ హీరో ఎవరని అడగక అల్లు అర్జున్ పేరు చెప్పింది హరితేజ. అల్లు అర్జున్ అంటే తనకు చాలా ఇష్టం కాబట్టే ఇలాంటివి చేశానంటూ తెలిపింది.