కోలీవుడ్ నటుడు మరియు దర్శకుడు అయినటువంటి ప్రదీప్ రంగనాథన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన నటించిన సినిమాలను వరుసగా తెలుగు లో విడుదల చేస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా కొంత కాలం క్రితం ఈయన నటించిన లవ్ టుడే సినిమా తెలుగులో విడుదల అయ్యి మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ఈయన నటించిన డ్రాగన్ మూవీ కూడా తెలుగు లో విడుదల అయ్యి మంచి విజయాన్ని సాధించింది. తాజాగా ఈ నటుడు డ్యూడ్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ని కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున విడుదల చేశారు. ఈ మూవీ కి తెలుగు రాష్ట్రాల్లో మంచి టాక్ వచ్చింది. మరి ఈ మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమా ఎన్ని కోట్లు సాధిస్తే తెలుగు రాష్ట్రాల్లో హిట్ స్టేటస్ లో అందుకుంటుంది అనే వివరాలను తెలుసుకుందాం.

మొదటి రోజు ఈ సినిమాకు నైజాం ఏరియాలో 85 లక్షల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ లో 22 లక్షలు , ఆంధ్ర లో 1.01 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా మొదటి రోజు ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2.08 కోట్ల షేర్ ... 3.60 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ దాదాపు 11 కోట్ల రేంజ్ లో రెండు కలిపి రాష్ట్రాల్లో షేర్ కలెక్షన్లను వసూలు చేస్తే హిట్ స్టేటస్ ను అందుకుంటుంది. దానితో ఈ మూవీ మరో 8.9 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబడితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హీట్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: