కన్నడ ఇండస్ట్రీలో హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతార చాప్టర్ 1 సినిమా అక్టోబర్ రెండవ తేదీన విడుదలై ఇప్పటివరకు రూ.750 కోట్లకు పైగా కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ చిత్రం విడుదలై ఇప్పటికీ మూడు వారాలు కావస్తున్నప్పటికీ ఇప్పటికీ థియేటర్లో హౌస్ ఫుల్ గానే రన్ అవుతోంది. దీంతో ఓటీటిలో ఈ సినిమా స్ట్రీమింగ్ కోసం ఓటిటి ప్రేక్షకులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటి విడుదలపై సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన విషయం వినిపిస్తోంది.


కాంతారా చాప్టర్ 1 సినిమా ఓటీటి హక్కులను అమెజాన్  ప్రైమ్ సొంతం చేసుకున్నట్లు వినిపిస్తున్నాయి. ఇందుకోసం రూ.125 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు వినిపిస్తున్నాయి. అక్టోబర్ 30 లేదా నవంబర్ మొదటి వారంలో కాంతార చాప్టర్ 1 చిత్రాన్ని స్ట్రిమింగ్ చేసే అవకాశం ఉన్నది. అయితే ఇందుకు సంబంధించి ఇంకా అధికారికంగా ప్రకటన అయితే వెలుపడలేదు. హోంభలే ఫిలిమ్స్ బ్యానర్ వారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తోనే నిర్మించారు. రుక్మిణి వసంత్ ఇందులో అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది.



అలాగే బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య  ప్రతి నాయకుడి పాతలో అద్భుతంగా ఆకట్టుకున్నారు. మరొక పాత్రలో తమిళ నటుడు జయరామ్ కూడా అద్భుతంగానే నటించారు. ఐఎండిబిలో కాంతార చాప్టర్ 1 చిత్రానికి 8.6 రేటింగ్ రావడం గమనార్హం. కన్నడ సినీ ఇండస్ట్రీలోని ఇప్పటివరకు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన రెండవ చిత్రంగా నిలిచింది ఈ సినిమా. మొదట హీరో యష్ నటించిన కే జి ఎఫ్ 2 సినిమా మొదటి స్థానంలో ఉంది. ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ సాధించిన  చిత్రాలలో ఛావా సినిమా రూ.830 కోట్ల తో మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడు ఈ సినిమా కలెక్షన్స్ ని అధికమించేలా కాంతార సినిమా దూసుకుపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: