ఆంధ్రప్రదేశ్లో కూటమిలో భాగంగా టిడిపి, జనసేన, బిజెపి పార్టీలు అన్ని విషయాలలో దూకుడు చూపిస్తున్నారు. విశాఖపట్నంనికి గూగుల్ డేటా సెంటర్ రావడం పైన కూడా ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపించారు. కానీ ఇందులో లక్షా88 వేల ఉద్యోగాలు వస్తాయని కూటమి ప్రభుత్వం తెలియజేసింది. కానీ వైసీపీ నేతలు ఈ విషయాలను ఖండిస్తున్నారు. ఈ విషయాన్ని అఫీషియల్ గా గూగుల్ తోనే ప్రకటించండి అంటూ డిమాండ్ చేస్తున్నారు వైసిపి నేతలు. ఎందుకంటే గూగుల్ సంస్థలో పనిచేసే వారి సంఖ్య అన్ని ప్రాంతాలలో కలుపుకొని లక్షా 88 వేల మంది ఉన్నారంటూ వైసీపీ నేతలు తెలుపుతున్నారు. మరి అలాంటిది ఏపీలో అన్ని ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యమేనా అని ప్రశ్నిస్తున్నారు.



ఇలాంటి సమయంలోనే కూటమి మిత్రపక్షాలు సైలెంట్ గా ఉన్నప్పటికీ తాజాగా బిజెపి శాసనసభ పక్ష నాయకుడు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఒక బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. విశాఖలో ఏర్పాటు కాబోతున్నటువంటి గూగుల్ సెంటర్ ద్వారా లక్షలలో  ఉద్యోగాలు రాబోతున్నాయని పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం ప్రకటనలు చేస్తోంది. ఈ విషయం పైన విష్ణుకుమార్ మాట్లాడుతూ లక్షలలో ఉద్యోగాలు వస్తాయనే విషయం అవాస్తవమంటూ తెలియజేశారు విష్ణుకుమార్. ఈ విషయం ఇప్పుడు సర్వత్ర రాజకీయాలలో చర్చనీయంశంగా మారింది. కానీ గూగుల్ విశాఖలో భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతోంది ఏకంగా లక్షా 33 వేల కోట్ల రూపాయలు అంటే అది మామూలు విషయం కాదు.అదే స్థాయిలో ఉద్యోగాలు వస్తాయని కూడా నిరుద్యోగులు ఆశిస్తున్నారంటూ తెలిపారు.


ఒక కోటికి ఒక ఉద్యోగం అయిన రాకపోతుందా అనే అశా కూడా ఉంది.కానీ లక్షల ఉద్యోగాలు అయితే రావని వేద ఉద్యోగాలు అయితే వస్తాయని తెలిపారు. గూగుల్ డేటా సెంటర్ కాల్ సెంటర్ కాదని కూడా తెలియజేశారు. గూగుల్ డేటా స్టోరీస్ చేసుకొనే సెంటర్ ని కూటమి ప్రభుత్వం విశాఖకు తీసుకువచ్చిందని  అంటూ బిజెపి నేత విష్ణుకుమార్ లాంటి వారు వివరించడంతో అసలు ఉద్యోగాలు ఎన్ని వస్తాయో అనే విషయం పైన కూడా నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. అలాగే ఫ్రీ బస్సు పైన కూడా విమర్శలు చేశారు. ఫ్రీ బస్సు వల్ల మహిళల డామినేషన్ ఎక్కువ అయ్యింది. బస్సులలో మగవారిని ఎక్కనివ్వడం లేదంటూ తెలిపారు. అలాగే సూపర్ సిక్స్ పథకాలలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయంటూ విష్ణుకుమార్ చెప్పడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: