మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఇటీవల నిర్వహించిన ప్రెస్ మీట్ తర్వాత వైసీపీ సోషల్ మీడియా వింగ్‌తో పాటు, ఆ పార్టీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పైనా ఇప్పుడు అందరి దృష్టి పడింది. కొద్దిరోజులుగా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గూగుల్ డేటా సెంటర్‌పై అమర్నాథ్ చేసిన వ్యతిరేక వ్యాఖ్యలు, ఇప్పుడు జగన్ మాటల ముందు నిలబడలేక బొక్క బోర్లా పడ్డాయి. పార్టీ వైఖరి వేరు... జగన్ మాట వేరు! ..  గూగుల్ డేటా సెంటర్ వల్ల ఉద్యోగాలు రావు, అది కేవలం కాలుష్యాన్ని పెంచుతుంది, నీటిని వృథా చేస్తుంది అంటూ గుడివాడ అమర్నాథ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే, ఆయన ఈ వ్యాఖ్యలు సొంతంగా చేసి ఉండరని, ఖచ్చితంగా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచో లేదా సజ్జల రామకృష్ణారెడ్డి ఆఫీస్ నుంచో వచ్చిన సూచనల మేరకే రకరకాల వ్యాఖ్యానాలు చేశారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అయితే, జగన్ రెడ్డి ఒక్కసారిగా మీడియా ముందుకొచ్చి పార్టీ శ్రేణుల ప్రచారానికి పూర్తి భిన్నంగా మాట్లాడారు. "గూగుల్ డేటా సెంటర్‌ను తాము స్వాగతిస్తామని, అది మంచిదేనని, దాని క్రెడిట్ తమకూ కావాలి" అంటూ ప్రకటించారు. పరువు పోగొట్టుకున్న అమర్నాథ్: పార్టీ చెప్పిన స్టాండ్‌ను నమ్మి, దానికి అనుగుణంగా వ్యతిరేక ప్రచారం చేసి, చివరికి జగన్ రెడ్డి ఒక్క ప్రెస్ మీట్‌తో దాన్ని ఖండించడం గుడివాడ అమర్నాథ్ పరువు పూర్తిగా పోగొట్టింది. అమర్నాథ్‌ను అపహాస్యం చేస్తూ, "కోడిగుడ్డు మంత్రి" అని ఇప్పటికే విమర్శలు గుప్పిస్తున్న ప్రత్యర్థులకు ఇప్పుడు జగన్ రెడ్డి మాటలు మరింత బలాన్నిచ్చాయి. సొంత పార్టీ అధినేతే తనతో అలా మాట్లాడించి, ఆ తర్వాత తానే దాన్ని కొట్టిపారేసినట్లుగా వ్యవహరించడంపై అమర్నాథ్ అభిమానులు కూడా కంగుతిన్నారు.

అస్పష్టమైన నాయకుడిని నమ్ముకుంటే ఇదే గతి! .. "జగన్ రెడ్డి లాంటి క్లారిటీ లేని నాయకుడ్ని, క్లారిటీ లేని విధానాలు ఉన్న పార్టీని నమ్ముకుంటే ఇలాగే 'బకరా' అయిపోతారు" అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అనవసరంగా ఆవేశపడి, పార్టీ వాయిస్‌గా మాట్లాడి ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ తానే అటూ ఇటూ కాకుండా పోయారు. తను మాట్లాడిన వ్యాఖ్యలు పార్టీ తరఫున కాదని, తన వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమేనని చెప్పుకుని ఇప్పుడు సర్దుకునే ప్రయత్నం చేస్తారేమో చూడాలి. ఏదేమైనా, ఈ గూగుల్ డేటా సెంటర్ వ్యవహారంలో జగన్ రెడ్డి తీరు.. అమర్నాథ్‌ను, వైసీపీ సోషల్ మీడియాను పూర్తిగా గందరగోళంలోకి నెట్టిందనేది నిర్వివాదాంశం.

మరింత సమాచారం తెలుసుకోండి: