ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 ఎన్నికల్లో కూటమి సర్కార్ సాధించిన ఫలితాలు సోషల్ మీడియాలో ఒక విధంగా సంచలనం అయ్యాయి. చంద్రబాబు మరోసారి సీఎం కావడంతో కూటమి శ్రేణుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఏడాదిన్నర పాలనలో కూటమికి పాజిటివ్ మార్కుల కంటే నెగిటివ్ మార్కులే ఎక్కువగా పడ్డాయి. సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేసే విషయంలో సైతం కూటమి సర్కార్ ఫెయిల్ అయిందనే చెప్పాలి.

మరోవైపు కూటమి సర్కార్ చేస్తున్న తప్పులే వైసీపీకి వరం అవుతున్నాయి.  రాష్ట్రంలో వైసీపీ నెమ్మదిగా పుంజుకుంటోంది.  జగన్ ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.  రాబోయే రోజుల్లో టీడీపీ పుంజుకోవడం సులువు కాదనే అభిప్రాయాలూ సైతం వ్యక్తమవుతున్నాయి.  గడిచిన ఏడాదిన్నర  కాలంలో  జరిగిన ఘటనలు సైతం టీడీపీపై ప్రజల్లో వ్యతిరేకత పెరగడానికి కారణమవుతున్నాయని చెప్పాలి.

అన్ని వర్గాల ప్రజలను సంతృప్తి పరిచే విషయంలో కూటమి సర్కార్ పూర్తిస్థాయిలో ఫెయిల్ అవుతోందని విమర్శలు  ఉన్నాయి.  చంద్రబాబు నాయుడు  చెప్పే మాటలకు వాస్తవంగా జరుగుతున్న పనులకు ఏ మాత్రం పొంతన లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.    పవన్ కళ్యాణ్ సైతం కూటమి సర్కార్ చేస్తున్న తప్పుల విషయంలో ఒకింత ఘాటుగా రియాక్ట్ కావడం లేదనే  చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతుండటం కొసమెరుపు.

కూటమి విషయంలో ఎక్కడ తప్పులు జరుగుతున్నాయో గమనించి చర్యలు చేపట్టాల్సిన బాధ్యత కూడా  పవన్ కళ్యాణ్ పై ఉందని చెప్పవచ్చు. కూటమి  జరుగుతున్న తప్పులను గుర్తించి జాగ్రత్త పడకపోతే 2029 ఎన్నికల ఫలితాలు  వైసీపీకి అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. రైతుల్లో సైతం తీవ్రస్థాయిలో  అసంతృప్తి ఉండటం చంద్రబాబు నాయుడుకు ఒక విధంగా మైనస్ అవుతోందని చెప్పవచ్చు.  ప్రజల్లో సైతం ఒకప్పటితో పోలిస్తే విద్యావంతులు ఎక్కువగా ఉన్నారు.  ఏది కరెక్ట్ ఏది తప్పు అని తెలుసుకోవడం ఇప్పుడు మరీ కష్టం అయితే కాదని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: