ఈ నేపథ్యంలో నవంబర్ ఒకటవ తేదీ లోపు మిగిలిన తొమ్మిది వందల కోట్లు విడుదల కాకపోతే మూడవ తేదీ నుంచి కాలేజీలు నిరవధికంగా మూసి వేస్తామని ప్రకటించారు.ప్రభుత్వం మిగిలిన బకాయిలపై స్పష్టమైన హామీ ఇవ్వాలని సమాఖ్య డిమాండ్ చేసింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం అడిగినప్పుడు ఎంక్వైరీలు జరపడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వార్థ రాజకీయాల కోసం కాలేజీలను బెదిరించడం సహించేది లేదని హెచ్చరించారు.
ఏ పోలీసును కూడా కాలేజీ ప్రాంగణంలోకి అడుగు పెట్టనివ్వమని స్పష్టం చేశారు. ఈ చర్యలు విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకే అని వివరించారు.నవంబర్ పదవ తేదీ లోపు రెండు లక్షల మంది విద్యార్థులతో భారీ సమావేశం నిర్వహించే యోచనలో సమాఖ్య ఉంది. ప్రభుత్వ వైఖరిని బట్టి నిరసన కార్యక్రమాలు తీవ్రతరం అవుతాయని తెలిపారు.
ఈ బంద్ ప్రకటన రాష్ట్రవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థలను ప్రభావితం చేయనుంది. విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం త్వరగా స్పందించాలని అందరూ కోరు తున్నారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి