కృష్ణాపట్నం పోర్టు ప్రాంతంలో అధికారులు ఐదవ స్థాయి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తీర ప్రాంతంలో అలలు ఎగసిపడుతూ సముద్రం ముందుకు వచ్చి పలు చోట్ల రోడ్లపైకి చేరింది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని ఆదేశాలు అమలు చేస్తున్నారు. హై అలర్ట్ ప్రకటించిన అధికారులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారిని అవసరమైన చోట సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు సన్నాహాలు చేశారు.
జిల్లా వ్యాప్తంగా చలిగాలులు వీస్తూ ప్రతి క్షణం ముప్పు రావచ్చన్న ఆందోళన నెలకొంది. సోమశిల కండలేరు రాళ్ళపాడు జలాశయాలు నిండుకుండలుగా మారాయి. పెన్నా నదికి నీటిని విడుదల చేయడం జరిగింది.పెన్నా సంగం బ్యారేజీల వద్దకు భారీగా నీరు చేరుతోంది. అధికారులు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తూ చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు హెచ్చరికలు పాటించి సహకరించాలని అభ్యర్థిస్తున్నారు. ఈ తుఫాన్ ప్రభావం తగ్గే వరకు అప్రమత్తత అవసరం. ప్రజలు హెచ్చరికలు పాటించి సహకరించాలని అభ్యర్థిస్తున్నారు. ఈ తుఫాన్ ప్రభావం తగ్గే వరకు అప్రమత్తత అవసరం.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి