విశాఖపట్నం వాతావరణ కేంద్రం ఉదయం ఐదు ముప్పై నిమిషాలకు విడుదల చేసిన నివేదికలో మొంథా తుఫాన్ స్థితిగతులు స్పష్టమయ్యాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ తుఫాన్ విశాఖపట్నానికి దక్షిణంగా మూడు వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంది. కాకినాడకు దక్షిణ ఆగ్నేయంగా మూడు వందల పది కిలోమీటర్లు మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా రెండు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో స్థిరంగా కొనసాగుతోంది.

గడిచిన ఆరు గంటల్లో గంటకు పదిహేను కిలోమీటర్ల వేగంతో ముందుకు సాగింది.తుఫాన్ ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ కొద్ది గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోనే తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. సాయంత్రం లేదా రాత్రి మచిలీపట్నం కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీవ్ర తుఫాన్ రూపంలో తీరాన్ని తాకే సూచనలు కనిపిస్తున్నాయి. అధికారులు తీర ప్రాంతాల్లో అప్రమత్తత పెంచారు. సముద్ర తీరంలో అలలు ఎగసిపడుతూ పరిస్థితి ఉద్ధృతమవుతోంది.తీరం దాటే సమయంలో గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

రాష్ట్రంలోని అత్యధిక ప్రాంతాల్లో ఈ రోజు వర్షాలు కురుస్తాయి. కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వానలు పడే అంచనాలు వెలువడ్డాయి. ప్రజలు ఇళ్లలోనే ఉండి జాగ్రత్తలు పాటించాలని సూచనలు జారీ అయ్యాయి.విపత్తు నిర్వహణ బృందాలు సిద్ధంగా ఉంచారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని ఆదేశాలు అమలవుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారిని సురక్షిత స్థలాలకు తరలించే ప్రక్రియ సాగుతోంది. రాష్ట్ర యంత్రాంగం నిరంతరం పర్యవేక్షణలో ఉంది. ప్రజలు హెచ్చరికలు శ్రద్ధగా అనుసరించి సహకరించాలని అధికారులు కోరుతున్నారు.

వాట్సాప్ నెంబ‌ర్‌ 94905 20108 కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: