రాష్ట్రంలో విద్యుత్ సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా ఉండటంతో పాటు, సమస్యలు తలెత్తే అవకాశం ఉన్న ప్రాంతాలలో చెట్లను తొలగించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ అత్యవసర పరిస్థితుల దృష్ట్యా, సచివాలయ ఉద్యోగులతో పాటు ఇతర కీలక అధికారులందరి సెలవులను ముఖ్యమంత్రి రద్దు చేశారు. రెవెన్యూ యంత్రాంగాన్ని సైతం ఆయన పూర్తిగా అప్రమత్తం చేశారు. ముఖ్యంగా, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రతి చిన్న విషయంపై వ్యక్తిగతంగా దృష్టి సారించి, సమస్యల పరిష్కారానికి తానే కృషి చేస్తున్నాననే అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించడంలో చంద్రబాబు నాయుడు సఫలమయ్యారు. వరద సాయక శిబిరాల్లో పౌరులకు నాణ్యమైన ఆహారం, వైద్య సదుపాయాలు అందేలా పర్యవేక్షించడంపై ఆయన ప్రధానంగా దృష్టి పెట్టారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఆయన తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలు, పర్యవేక్షణ విషయంలో చంద్రబాబును ఎంత ప్రశంసించినా తక్కువే. ఆయన నాయకత్వ లక్షణాలు, ముందుచూపు రాష్ట్ర ప్రజలకు భరోసా కల్పిస్తున్నాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి