రెండు తెలుగు రాష్ట్రాలలో సూపరిచితమైన ప్రముఖ పెయింట్స్ కంపెనీ తన వ్యాపార విస్తరణలో భాగంగా ఇప్పుడు పాన్ ఇండియా సేల్స్ అండ్ ఆపరేషన్స్ తో పాటు రిటైల్ రంగంలో నూతన భాగస్వాములతో కలసి ఫ్రాంచైజ్ ల‌ను అన్ని రాష్ట్రాలలో నెలకొలపుతున్నారు దానిలో భాగంగా బ్రాండ్ టెక్నో పెయింట్స్ దేశంలోని అన్ని రాష్ట్రాలకి మరియు అన్ని ప్రాంతాల ప్రజలకి కస్టమర్లకి మరింత చేరువ కావడానికి తన నూతన బ్రాండ్ అంబాసిడర్ గా గాడ్ అఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ ని నియమించుకొని, గురువారం నాడు ముంబయిలో రెండు ప్రచార చిత్రాలను నిర్మించారు. ఈ రెండు యాడ్ ఫిల్మ్స్ కూడా ఇటీవల ఓజీ చిత్రం తో ఇండస్ట్రీ హిట్ అందుకున్న ప్రముఖ యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వం వహించాడు.. ఈ ప్రచారం చిత్రాలు అతి త్వరలోనే దేశంలోని అన్ని ప్రముఖ మధ్యమాల ద్వారా విడుదల చేయటానికి ప్రయత్నిస్తామని కంపెనీ చైర్మన్ శ్రీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.


సుజిత్ అంటేనే ఎంతో స్టైలీష్ గా సీన్లు తెర‌కెక్కిస్తారు. ఇటీవ‌లే ఓజీ సినిమాను సుజిత్ ఎంత స్టైలీష్ గా తెర‌కెక్కించారో చూశాం. ఇప్పుడు ఏకంగా గాడ్ ఆఫ్ క్రికెట్ స‌చిన్ తో టెక్నో పెయింట్ ప్ర‌చార చిత్రాలు తెర‌కెక్కించారంటే చాలా స్టైలీష్ టేకింగ్‌తో అద‌ర‌గొట్టేసి ఉంటాడ‌న్న టాక్ మొద‌లైంది. స‌చిన్ ఈ బ్రాండ్ కు అంబాసిడ‌ర్‌గా ఉండ‌డంతో దేశంలోనే ఈ టెక్నో పెయింట్ ఖ‌చ్చితంగా త‌న‌దైన ముద్ర వేసుకుంటుంద‌నే చెప్ప‌వ‌చ్చు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: