ఏదైనా ఒక రాష్ట్రంలో ఒక పార్టీ అధికారంలో ఉంది అంటే ఆ పార్టీ కి కొంత మంది ప్రభుత్వ అధికారులు ఫేవర్ గా పని చేస్తున్నారు అని ప్రతిపక్ష నేతలు చెప్పడం సర్వసాధారణమైన విషయం. అలాగే మేము అధికారం లోకి వచ్చాక ప్రస్తుతం ప్రజలకు ఎంతో అన్యాయం చేస్తున్న ఆ ప్రభుత్వాధికారులపై కఠిన చర్యలు తీసుకుంటాము అని చెప్పిన పార్టీలు కూడా అనేకం ఉన్నాయి. ఇక ఆ తదుపరి జరిగిన ఎన్నికలలో కనుక అప్పుడు ప్రతి పక్ష పార్టీగా ఉన్న పార్టీ అధికారం లోకి వచ్చాక వారు ప్రతి పక్ష పార్టీగా ఉన్న సమయంలో అనేక అక్రమాలకు పాల్పడ్డారు అని పేర్కొన్న ప్రభుత్వ అధికారులపై కొంత మంది చర్యలు తీసుకుంటారు. మరి కొంత మంది చర్యలు తీసుకోరు.

ఇకపోతే కొంత కాలం క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరిగిన విషయం మనకు తెలిసిందే. ఈ ఎన్నికలలో వై సీ పీ పార్టీ ఎవరితో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తే తెలుగుదేశం , జనసేన ,  బీజేపీ మూడు పార్టీలు కలిసి పొత్తులో భాగంగా పోటీలోకి దిగాయి. ఇక ఈ పొత్తులో తెలుగుదేశం , జనసేన ,  బీ జే పీ కూటమికి అద్భుతమైన స్థాయిలో అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. దానితో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారం అధికారంలో ఉంది. కూటమి ప్రభుత్వం కంటే ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వై సీ పీ పార్టీ అధికారంలో ఉంది.

వై సీ పీ పార్టీ అధికారం లో ఉన్న సమయంలో కొంత మంది ప్రభుత్వ అధికారులు ఎన్నో అక్రమాలకు పాల్పడుతున్నారు అని పేర్కొన్నారు. ఇకపోతే కూటమి ప్రభుత్వం అధికారం లోకి రాగానే కొంత మంది పోలీస్ అధికారులు వై సీ పీ కి సపోర్టు గా ఉన్నారు అనే పేరుతో వారిని పక్కన పెట్టారు. వారికి సపోర్టుగా తిరుపతి ఎంపీ గురుమూర్తి తాజాగా హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఇక హైకోర్టులో గురుమూర్తి తరపు న్యాయవాదులు ముందుగా సుప్రీం కోర్టు లో ఇలాంటి తీర్పు ఇచ్చారు అని చెప్పగా ... మీరు అయితే సుప్రీం కోర్టు దగ్గరికి వెళ్ళండి అని హైకోర్టు సూచించింది. ఇలా తాజాగా వై సీ పీ ఎంపీ గురుమూర్తి కి హైకోర్టు లో గట్టి షాక్ తగిలినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: