అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు, చేసేటువంటి వ్యాఖ్యలు ఈ మధ్యకాలంలో చాలా హాస్యాస్పదంగా మారుతున్నాయి. ఒక దేశ అధ్యక్షుడిగా ఉండి బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు. ప్రచారం పిచ్చితో ఏది పడితే అలా మాట్లాడుతున్నారు. అధ్యక్షుడు స్థానంలో ఉండి అమెరికా పరువు తీస్తున్నట్టుగా వ్యవహరిస్తున్నారు ట్రంప్.ఆమధ్య భారత్ ,పాకిస్తాన్ యుద్ధంలో యుద్ధాన్ని ఆపానంటూ ఇప్పటికే ఎన్నోసార్లు మాట్లాడడం కూడా ట్రంప్ ను ట్రోల్ కి గురి చేశాయి. అందులో ఒకసారి ఐదు విమానాలు కూల్చేశామని చెప్పారు.ఒకసారి ఆరు మరొకసారి ఏడు, ఇప్పుడు తాజాగా భారత్ పాకిస్తాన్ ఘర్షణలో 8 విమానాలు కూలిపోయాయని తెలియజేశారు.


వాస్తవానికి ట్రంప్ కి భారత్, పాకిస్తాన్ యుద్ధం ఆపడానికి సంబంధమే లేదు. కానీ ట్రంప్ వాగుతూనే ఉన్నారు. అయితే ఇలాంటి వ్యాఖ్యను కొంతమంది ఇక్కడ హీరోయిజం కింద ప్రాజెక్టు చేస్తూ ఉన్నారు. ఈ విషయాల పైన మోదీ ని సైతం ప్రశ్నిస్తున్నారు. ట్రంప్ నోటికొచ్చిందల్లా మాట్లాడుతూ ఉంటే వివరణ ఇవ్వాల్సిన పని లేదంటూ కొట్టి పారేస్తున్నారు బిజెపి నేతలు. ట్రంప్ కి ఈ మధ్య చాలా పిచ్చి ముదిరిపోయింది అంటూ పలువురు నేతలు కూడా కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ట్రంప్ యూఎస్ఏ కి వెళ్లాలనుకునే వారికి మరొక షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమెరికాకు వెళ్లాలనుకునే వారికి చాలా కఠినమైన నిర్ణయాలు, నిబంధనలు కొనసాగిస్తున్నారు ట్రంప్.


ఇప్పుడు తాజాగా ఆరోగ్య విషయంలో కూడా వలసదారుల పైన ప్రత్యేకించి మరి దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. యూఎస్ఏ కి వెళ్లాలనుకునేవారు డయాబెటిస్, ఉబకాయం దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడే వారికి వీసాలను తిరస్కరిస్తామంటూ కొత్త మార్గదర్శకాలను జారీ చేసినట్లుగా వినిపిస్తున్నాయి. గతంలో టీబీ వంటి అంటూ వ్యాధులకు కూడా స్క్రీనింగ్ నిర్వహించిన తర్వాతే వీసాల పైన నిర్ణయం తీసుకునేవారు. ఇప్పుడు అలాంటి జాబితాలలో డయాబెటిస్, ఉబకాయం వంటి జబ్బులను కూడా చేర్చినట్లు వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: