జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం నడుస్తున్న సమయంలో పార్టీ నేతల మధ్య విపరీతమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ బెటాలియన్ అంత బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తోంది. ఇక బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పై విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఈ విధంగా ఎవరికి వారే గెలవాలని చెప్పేసి హోరా హోరీగా పోరాడుతున్నారు. ఇదే తరుణంలో తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర మంత్రులతో కలిసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు సంచలనం రేపుతున్నాయి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది మేమే అని అభివృద్ధి చేసేది కూడా మేమే అని చెప్పుకొచ్చారు.. మాకు ఓట్లు వేయండి అభివృద్ధిని చూడండి అంటూ మాట్లాడారు.. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇండస్ట్రీని ఏ విధంగా వాడుకున్నారో హీరోయిన్లతో ఎలా గడిపారో అందరికీ తెలుసని షాకింగ్ కామెంట్స్ చేశారు..

 బీఆర్ఎస్ అంటే కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు మాత్రమే అన్నట్టు మాట్లాడారు. ఓటమి భయంతోనే జూబ్లీహిల్స్ అభ్యర్థి రౌడీ అంటూ పదేపదే మాట్లాడుతున్నారని  తెలియజేశారు.. దీపావళి పండుగ రోజున డ్రగ్స్ వాడే వాడు రౌడీ నా.. నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకునేవారు రౌడీనో అందరికీ తెలుసు అన్నారు.. మైనారిటీ నాయకుడు అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇస్తే కూడా బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేక పోతున్నారని అన్నారు. అలాగే రాష్ట్రంలో గంజాయి రాజ్యమేలుతున్నది..

పది సంవత్సరాలు విచ్చల విడిగా గంజాయి స్మగ్లింగ్ చేశారని తెలియజేశారు. గంజాయి వల్లే అమ్మాయిలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని సూచించారు. ఇప్పటినుంచి గంజాయి పై డేగ కన్ను వేసి గంజాయి డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వం నిబద్దతతో పనిచేస్తుందని తెలియజేశారు. రాష్ట్రంలోకి గంజాయి రావాలంటేనే వణుకు పుట్టాలని, అలాంటి వ్యవస్థ తీసుకువస్తామని అన్నారు. కేటీఆర్, కిషన్ రెడ్డి బ్యాడ్ వ్యక్తులు అంటూ హైదరాబాద్ అభివృద్ధిని వీరే అడ్డుకుంటున్నారని  హితవు పలికారు.

మరింత సమాచారం తెలుసుకోండి: