శ్రీవారి భక్తులను కూడా ఆ టీటీడీ సిబ్బంది బెదిరించినట్లుగా పలు రకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో అక్కడ వెళ్తున్న భక్తులు సైతం ఆ సిబ్బందిని ప్రశ్నించగా ఆ సిబ్బంది మాత్రం తాము ఊరు నుంచి తెచ్చుకున్నామంటూ సమాధానాన్ని తెలియజేశారు.. అయితే ఎక్కడి నుంచి తెచ్చుకున్న కూడా ఇక్కడ తినడం తప్పు కదా అంటూ ప్రశ్నించారు భక్తులు. ఈ విషయానికి సంబంధించి ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ కూడా సోషల్ మీడియా వేదికగా ట్విట్ చేసింది. పారిశుద్ధ్య కార్మికుల పైన టీటీడీ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు..
ఇదే కాకుండా గతంలో కూడా తిరుమలలో మాంసాహారం బయటపడిన సందర్భాలు చాలానే కనిపించాయి. ఇప్పుడు తాజాగా ఈ ఘటన జరగడంతో మరొకసారి ఈ విషయం ఏపీ అంతట సంచలనంగా మారింది. ఈ విషయంపైన టిటిడి సంచల నిర్ణయం తీసుకుంటూ ఔట్ సోర్సింగ్ సిబ్బంది రామస్వామి, నరసింహులు ఆదివారం రోజున అలిపిరి మార్గమధ్యంలో మాంసాహారం తిన్నట్లుగా ఆ విషయం మా దృష్టికి వచ్చింది. అందుకే ఈ ఇద్దరి పైన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసాము. అలాగే ఇద్దరినీ కూడా ఉద్యోగాల నుంచి తొలగించామంటూ తెలియజేశారు. ఇకమీదట ఇలాంటివి మళ్లీ జరగనివ్వకుండా చూసుకుంటామంటు తెలియజేస్తున్నారు టీటీడీ అధికారులు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి