తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి  చాలా ఆసక్తికరంగా మారింది.. ఈ ఎన్నిక అన్ని పార్టీలకు ఒక జీవన్మరణ పోరాటంలా మారింది.. ఇక్కడ గెలిస్తేనే అన్ని పార్టీలకు భవిష్యత్తు ఉంటుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ బ్రతికి బట్ట కట్టాలి అంటే తప్పనిసరిగా జూబ్లీహిల్స్ లో విజయం సాధించాల్సిందే.. కానీ జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పాయి.. ఇక ప్రీ ఫోల్ సర్వేలో బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పారు.. ఇక ఏ పార్టీ గెలుస్తుంది అనేది బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమై ఉంది.. ఈ విధంగా జూబ్లీహిల్స్ ఎన్నిక ఫలితాలపై  రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే మాత్రం వారికి ఇబ్బందులు తప్పవు. ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ లో చేరారు.

 దీంతో కేటీఆర్ ప్లాన్ వేసి మళ్లీ కొంతమందిని కాపాడుకోగలిగారు. ఒకవేళ ఎన్నికల్లో రిజల్ట్ తారుమారు అయింది అంటే కాంగ్రెస్ చాలా బలపడుతుంది. ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలామంది ఆ పార్టీలోకి లేదంటే బీజేపీలోకి వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తారు.. దీంతో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పలుచబడిపోతుంది.. కేటీఆర్ ఎంత ప్రయత్నం చేసినా కానీ పార్టీ నిలబడలేక పోతోంది. కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్ కే పరిమితమై కనీసం బయటకు రావడం లేదు..ఇది ఇలా నడుస్తున్న సమయంలో పూర్తిగా బిజెపి కూడా కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తుంది.

ఎందుకంటే బీఆర్ఎస్ పలుచబడితే ఆ స్థానాన్ని బిజెపి అధిరోహించాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇదిలాగే కొనసాగితే మాత్రం తెలంగాణలో బిజెపి పూర్తిగా లేకుండా అయిపోతుంది. ఆ స్థానంలో బిజెపి ఉంటుందని , బీఆర్ఎస్ భవిష్యత్తు అంధకారంగా మారిపోతుందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి చూడాలి రాబోవు రోజుల్లో అయినా కేసీఆర్ బయటకు వచ్చి బీఆర్ఎస్ పార్టీని కాపాడతారా లేదంటే కేటీఆర్, హరీష్ రావులకే అప్పజెప్తారా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: