జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు ఈరోజు బయటకు వస్తున్నాయి. ఎంతో ఉత్కంఠగా సాగుతున్నటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ చాలా ఆసక్తికరంగా మారింది. మొత్తం 42 టేబుల్స్ ఏర్పాటు చేసి ఫలితాలు లెక్కిస్తున్నారు. మొత్తం 10 రౌండ్లలో లెక్కింపు ఉంటుంది. 40 నిమిషాలకు ఒక రౌండు ఫలితం బయటకు వస్తుంది.  ఇదే సమయంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అనేది పూర్తి అయింది. ఈ క్రమంలోని పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఏ పార్టీకి పడ్డాయి, ఏ పార్టీకి  కలిసి వచ్చాయనేది బయట పడింది. అయితే ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ఆధారంగానే ఎన్నికల ఫలితం అనేది కూడా ఉంటుందనేది జగమెరిగిన సత్యం. ముఖ్యంగా చాలామంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరి ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో నవీన్ యాదవ్ కు పడ్డాయా, లేదంటే మాగంటి సునీతకు ఓటు వేశారా..లేదంటే ఇద్దరినీ కాదని లంకల దీపక్ రెడ్డికి వేశారా, వీళ్ళందరినీ కాదని వేరే అభ్యర్థులకు వేశారా, అనేది ఆసక్తికరంగా మారింది..

అయితే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అనే ఫలితం ఆధారంగానే గెలుపుపై కూడా ఆశ ఉంటుంది. మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 101 పోస్టల్ ఓట్లు ఉన్నాయి. మరి ఈ ఓట్లు అనేవి ఎవరికి వేశారు అనేది చూద్దాం.. మొత్తం 101 పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ఫలితాలు బయటకు వచ్చాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు 39 ఓట్లు వచ్చాయి. అలాగే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 36 ఓట్లు వచ్చాయి. బిజెపి అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 10 ఓట్లు వచ్చాయి.

 మిగతా 16 ఓట్లు ఇతర అభ్యర్థులకు పడ్డాయి. ఈ విధంగా చూస్తే కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్య చాలా టఫ్ ఫైట్ నడుస్తోంది. కేవలం మూడు ఓట్ల తేడాతో నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. దీన్నిబట్టి చూస్తే బీఆర్ఎస్ కూడా తప్పు ఫైట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అసలు డిపాజిట్ రాదనుకున్నటువంటి బిజెపి కూడా చాలా ఓట్లు వస్తున్నాయి. ఈవీఎం ఫలితాలు కూడా ఈ విధంగానే ఉంటాయా అనేది మరి కొన్ని గంటల్లో బయటకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: