ప్రైవేట్ టీవీ చానెళ్లు ఇటీవల కాలంలో ప్రసారం చేస్తున్న కథనాలు హద్దులు మీరి పోతున్నాయన్న అంశంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. కొన్ని చానెళ్లు బాంబులను ఎలా తయారు చేయాలనే అంశాలను కూడా నిస్సిగ్గుగా ప్రసారం చేస్తున్నాయి. ఇటువంటి బాధ్యతారహితమైన ప్రసారాల విషయంలో కేంద్ర సమాచార శాఖ ప్రైవేట్ టీవీ చానెళ్లకు హెచ్చరికలు జారీ చేసింది.

సమాచారాన్ని, వార్తలను ప్రజలకు చేరవేయడంలో మీడియాకు ఉన్న బాధ్యతను ఈ సందర్భంగా కేంద్రం గట్టిగా గుర్తు చేసింది. ఒక మతానికి తీవ్రవాదానికి ముడి పెట్టడం సరికాదని, తీవ్రవాదానికి మాత్రం ఒక మతం ఉందని ప్రపంచానికి తెలిసిందేనని కేంద్రం తన మార్గదర్శకాల్లో పేర్కొంది. ఇస్లామిక్ రాజ్యం కోసమే కొందరు తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, దీనికి సహకరించే వారిని సైతం మతం మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్రం దృష్టికి వచ్చింది.

ప్రసారాలు చేసేటప్పుడు చట్ట విరుద్ధ కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించకూడదని కేంద్రం స్పష్టం చేసింది. తీవ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించే విధంగానో, వారికి సహకరించే విధంగానో ప్రసారాలు ఉండకూడదు. బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, దేశ సమగ్రతకు, శాంతిభద్రతలకు భంగం కలిగించే కథనాలను ప్రసారం చేయవద్దని కేంద్ర సమాచార శాఖ ఈ ఆదేశాలలో ప్రైవేట్ టీవీ చానెళ్లకు తేల్చి చెప్పింది. ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి.

మీడియా కేవలం వార్తలను అందించడానికే పరిమితం కాకుండా, సమాజం పట్ల, దేశం పట్ల పూర్తి బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఈ హెచ్చరికలు తెలియజేస్తున్నాయి. బాధ్యతను విస్మరించిన పక్షంలో కఠిన చర్యలు ఉంటాయని కూడా కేంద్రం పరోక్షంగా సూచించినట్టే భావించాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: