``ఎవరూ పట్టించుకోలేదు.. కానీ, పట్టించుకుంటే మంచి నాయకుడు అవుతాడు!.`` గతంలో ఓ సీనియర్ నాయకుడు చెప్పిన మాట.. శంకర్‌విషయంలో నిజమైంది. గత 2024 ఎన్నికల్లో తొలిసారి విజయం దక్కిం చుకున్న శంకర్ వివాదాలకు దూరంగా ఉంటున్నారు. అంతేకాదు.. ప్రతి ఒక్కరినీ కలుపుకొని పోతున్నారు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా.. నేనున్నానంటూ అభయం ప్రసాదిస్తున్నారు. చంద్రబాబు తరచుగా శంకర్ గురించి ఎమ్మెల్యేల ముందు మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి.
1వ తేదీ వచ్చిందంటే.. పింఛన్ల పంపిణీలో ముందుంటున్నారు. ఎవరికైనా సమయానికి అందకపోతే.. వారికి అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల ఆటో కార్మికులకు ప్రభుత్వం రూ.10 వేల చొప్పున జమ చేసినప్పుడు కూడా తన నియోజకవర్గంలో అందని వారిని వెంటబెట్టుకుని కలెక్టర్ వద్దకు తీసుకువెళ్లి న్యాయం చేయించారు. ఇక, పక్కా ఇళ్లు లేని వారిని తానే గుర్తించి.. సాధ్యమైనంత వేగంగా ప్రభుత్వం నుంచి న్యాయం జరిగేలా చేస్తున్నారు.
ఇక, పార్టీ పరంగా ఆయనకు కొట్టిన పిండి. 2024కు ముందు వరకు శ్రీకాకుళం మండలంలోని కృష్ణప్ప పేటకు సర్పంచ్‌గా ఉన్నారు. ఆ సమయంలో ప్రజలకు మరింత చేరువ అయ్యారు. గత ఎన్నికల్లో ఏకంగా 60.9 శాతం మేరకు ఓట్లు తెచ్చుకుని.. చంద్రబాబు దగ్గర అభిమానం సంపాయించుకున్నారు. పార్టీలైన్‌కు భిన్నంగా వ్యవహరించడం కానీ.. నోరు విప్పడం కానీ.. ఎరుగని నాయకుడుగా కూడా గోండు శంకర్ గుర్తింపు పొందడం గమనార్హం. మొత్తంగా ఫస్ట్ టైమే గెలిచినా.. ఆయన ప్రజల ముందు మనసు పరిచేశారనే చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి