సాధారణంగా వస్తువుల్లో ఆహార పదార్థాలలో నకిలీవి ఉండడం మనం చూస్తూ ఉంటాం. అలాంటిది ఏకంగా పోలీస్ శాఖలో కూడా  నకిలీ ఉద్యోగులు వస్తున్నారు.. దొంగలను నకిలీ వస్తువులను పట్టుకునే ఆ పోలీసులు ఈ నకిలీ కానిస్టేబుల్ ని కనీసం  గుర్తించలేకపోయారు.. మరి అది ఎక్కడ జరిగింది ఆ వివరాలు చూద్దాం.. నిత్యం సైబరాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఉంటూ పోలీస్ బాస్ లతో చాయ్ లు, టిఫిన్లు చేస్తూ బందోబస్తులకు కూడా వెళ్ళింది. అలాంటి నకిలీ పోలీస్ బాగోతం తాజాగా బట్టబయలైంది. జీడిమెట్లకు చెందినటువంటి ఉమా భారతీయ అనే యువతి పోలీస్ కానిస్టేబుల్ కావాలనే కోరిక ఉండేది. కానిస్టేబుల్ ఉద్యోగం కోసం కూడా చాలా ప్రిపేర్ అయినా కొంతలో జాబ్ మిస్సయింది. 

కానీ ఎలాగైనా పోలీస్ డ్రెస్ వేసుకొని డ్యూటీ చేయాలనేదే ఆమె కల. దీంతో పోలీస్ డ్రెస్ కుట్టించుకొని నేమ్ ప్లేట్ పెట్టుకొని అచ్చం పోలీస్ లాగే అన్ని రెడీ అయి తనకి జాబ్ వచ్చిందని బంధువులకు పోలీసులకు కూడా చెప్పింది. తన తండ్రి నిత్యం తన కూతుర్ని సైబరాబాద్ సీపీ ఆఫీస్ దగ్గర  వదిలి పెట్టి వాడు. గేటు వద్ద ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది కూడా ఆమెను పెద్దగా అనుమానించలేదు. అలా ప్రతిరోజు డ్యూటీకి వెళ్లడం అక్కడున్న కానిస్టేబుల్స్ అందరితో మాట్లాడడం చేసింది. సీనియర్ ఆఫీసర్ కి సెల్యూట్ చేయడం, క్యాంటీన్లో అందరితో కలిసి టీ టిఫిన్లు లాంటివి చేయడం చేసుకుంటూ వచ్చింది. కానీ ఎక్కడా అనుమానం రాలేదు. సీఎం మినిస్టర్ మీటింగ్స్ లో కూడా డ్యూటీ చేసింది.  

  సైబర్ క్రైమ్స్ కార్యక్రమాల స్కూళ్లలో కాలేజీలో లెక్చర్స్ కూడా ఇచ్చింది. అయితే తాజాగా బందోబస్తు డ్యూటీకి వచ్చిన ఉమా భారతిని కాకి డ్రెస్ కున్న బ్యాడ్జిలు గమనించారు. ఒక సీనియర్ అధికారి. హెడ్ కానిస్టేబుల్ కు ఉండాల్సిన బ్యాడ్జీ తనకు ఉంది. వెంటనే తనని పిలిచి ఏ బ్యాచ్ అని అడిగారు ఆఫీసర్. 2022 బ్యాచ్ అని చెప్పింది. చేరిన మూడేళ్లలోనే హెడ్ కానిస్టేబుల్ ఎలా అవుతుందని అనుమానించిన ఆఫీసర్ ఆమె డేటా వెరిఫై చేస్తే అడ్డంగా దొరికిపోయింది. దీంతో ఆమెను గట్టిగా విచారించగా తనకు పోలీస్ అవడం అంటే ఇష్టం జాబ్ రాకపోవడంతోనే ఇలా చేశానని చెప్పుకొచ్చింది. కానీ కానిస్టేబుల్ గా ఉన్న ఆమె ఎక్కడ వసూలు చేయడం కానీ బెదిరింపులు చేయడం కానీ చేయలేదు. ఏమి చేయకపోయినా పోలీస్ కానిస్టేబుల్ గా నాటకం ఆడింది కాబట్టి ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: