జగన్ ‘కుట్ర’లో జోగి బలిపశువా? .. కొందరి విశ్లేషణ ప్రకారం, జోగి రమేష్ అక్రమ మద్యం కేసు వెనుక ఒక కుట్ర దాగి ఉంది. తన అనుచరుల ద్వారా అక్రమ మద్యం వ్యాపారాన్ని పట్టించి, రాష్ట్రమంతా ఇదే ఉందని ఆరోపించి, ప్రతి సహజ మరణాన్ని కూడా అక్రమ మద్యం ఖాతాలో వేసి జగన్ రెడ్డి భారీ ‘ఓదార్పు యాత్ర’ చేయాలనుకున్నారు. కానీ, ఈ కుట్ర బద్దలు కావడంతో జగన్ సైలెంటయ్యారు. ఫలితంగా, జగన్ ప్లాన్ వల్లే జోగి జైలుకెళ్లాల్సి వచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు జోగి రమేష్ బలహీనతను వైసీపీ పెద్దలు ఇష్టమొచ్చినట్లు వాడుకున్నారు. పదవి కోసం ఏం చేయమన్నా చేస్తాడని బూతులు తిట్టించారు, చంద్రబాబు ఇంటిపై దాడికి పంపారు, అసెంబ్లీలో రఘురామ కృష్ణరాజును ఘోరంగా తిట్టించారు. ఇవన్నీ వినీ ఆనందించిన జగన్... ఇప్పుడు జోగి జైలుపాలైతే కనీసం కనీసం ఓ సారి పరామర్శించడం లేదు.
‘బకరాలు’గా మారిన వైసీపీ నేతలు! .. జగన్ రెడ్డి కోసం ఐదేళ్లపాటు మానసికంగా ఆనందింపజేయడానికి చేసిన పనులే ఇప్పుడు జోగి రమేష్‌కి పెను సమస్యగా మారాయి. మిథున్ రెడ్డి దగ్గరనుంచి జోగి రమేష్ వరకూ అందరూ జైళ్లకు వెళ్తున్నారంటే దానికి కారణం కేవలం జగన్ మోహన్ రెడ్డి అవినీతి సంపాదన, మానసిక ఆనందం కోసమే అని ఆ పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. జైలుకెళ్లిన వారిపై కనీస సానుభూతి కూడా చూపకుండా, వారు చేసిన కర్మకు వారే బాధ్యులు అన్నట్లుగా వ్యవహరిస్తున్న జగన్ తీరుపై సొంత పార్టీలోనే జోకులేసుకుంటున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాజకీయ అవసరాల కోసం వాడుకుని, ఆపదలో వదిలేసే జగన్ పాలిటిక్స్‌కు తాజా ఉదాహరణ జోగి రమేష్ వ్యవహారం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి