ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటినుండి చాలామంది కూటమి ప్రభుత్వానికి వంత పాడుతూ చేసింది ఇసుమంత అయితే చెప్పేది కొండంత అంటూ ప్రచారం చేసుకుంటున్నారు.అంతేకాదు చంద్రబాబు గవర్నమెంట్ ఎలాంటి కొత్త పనులు ప్రారంభించినా.. ఏం చేసినా సరే కొన్ని వార్తా పత్రికలు కూడా చంద్రబాబుని ఓ రేంజ్ లో పొగుడుతున్నారు.అయితే తాజాగా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చంద్రబాబు చేసే  పనుల గురించి చర్చిస్తూ ఆంధ్రప్రదేశ్ ని చంద్రబాబు గవర్నమెంట్ ఏమైనా కొత్తగా తయారు చేస్తుందా..ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రం విడిపోక ముందు నుండి కూడా ఉత్తరాంధ్రను ఉత్తరాంధ్రనే,ఆంధ్రాని ఆంధ్రనే,రాయలసీమని రాయలసీమనే తెలంగాణని తెలంగాణ అనే అనేవారు  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ నాలుగు ఉండేవి.

 ప్రస్తుతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోవడంతో తెలంగాణ వేరు పడిపోవడంతో ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ, ఉత్తరాంధ్ర,కోస్తాంధ్ర వంటివి ఉన్నాయి. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఏదో ఆంధ్రప్రదేశ్ ని కొత్తగా తీర్చిదిద్దినట్టు విశ్వకర్మ చెక్కినట్టు చెప్పుకొస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధికి మూడు జోన్లు అని ప్రచారం చేస్తున్నారు. మరి ఇంతకుముందు నాలుగు జోన్లు ఉన్నప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం కదా రాష్ట్ర వినాశనానికి ఏమీ చేయలేదు కదా.. అలాగే సమగ్ర వికాసానికి ప్రాంతాలవారీగా ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పుకొస్తున్నారు. మరి అప్పటి ప్రభుత్వాలు చేసింది సమగ్ర వికాసానికి కాకుండా సమగ్ర నాశనానికా.. ఇది ప్రజలు ముందుగా గమనించాలి.. విశాఖ రీజియన్ లో 9, అమరావతిలో 8,రాయలసీమలో తొమ్మిది జిల్లాలు.. అయితే ఉన్న జిల్లాలని డివైడ్ చేయడం తప్ప కొత్తగా ఏమీ భూమి కొని లేక తయారుచేసి తీసుకురాలేదు కదా..

 గతంలో జగన్ ప్రభుత్వం చేసింది మధ్యలో ఓ రెండు జోన్లు పెట్టారు అంతే.. అయితే జగన్ ప్రభుత్వం చేస్తే దుర్మార్గం బాబు గారి ప్రభుత్వం చేస్తే సన్మార్గం అనే విధంగా కొన్ని వార్తాపత్రికల్లో ప్రచురిస్తున్నారు. మరి ఆనాడు జగన్ చేసింది ఏంటి.. జగన్ చేసినప్పుడు ఈ విధంగా చెప్పలేదే.. చంద్రబాబు చేస్తే అది పెద్ద గొప్పలాగా ఎందుకు చెప్పుకొస్తున్నారు అనేది అర్థం అవడం లేదు. జగన్ ప్రభుత్వం ఎంత చేసినా సరే ఆ రాసేవాళ్లు ఫీలయ్యి అబ్బ వీళ్లు అద్భుతంగా చేస్తున్నారు అనుకుంటే తప్ప పత్రికల్లో ప్రచురించరు. కానీ జగన్ ప్రభుత్వం ఎన్ని అద్భుతాలు చేసినా కూడా ఈ పత్రికల వాళ్లే వీళ్ళు చేసింది ఏమీ లేదు అంతా వేస్ట్ చేస్తున్నారు అని రాసుకొస్తారు.ఇది రాష్ట్రంలోని కొన్ని పత్రికల పరిస్థితి అంటూ కొంతమంది సీనియర్ జర్నలిస్టులు పత్రికల్లో వచ్చే వార్తలపై మండిపడుతున్నారు. అంతేకాదు వీటిని ప్రజలు గమనించాలని చెప్పుకొస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: