వచ్చే ఏడాది 2026లో ఇండియాలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. సుమారుగా 1,50,480 చేరే అవకాశం ఉంటుందట. ఇక 2025లో 50% నుంచి 60 % వరకు పెరుగుదల నమోదయింది. 2026 లో బంగారం ధర ఎంత ఉంటుందనే విషయంపై గూగుల్ లోనే అత్యధిక సెర్చింగ్ ట్రెండీగా మారింది. నిపుణులు, బ్యాంకర్ల అంచనాల ప్రకారం 2026లో బంగారం ధర డిమాండ్ ఎక్కువగా ఉంటుందని. చాలామంది బంగారం మీద సురక్షితమైన పెట్టుబడిగా ఎంచుకున్నారు. కేంద్ర బ్యాంకులు కూడా అధిక మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేసినట్లుగా తెలుపుతున్నారు.
ప్రపంచ మార్కెట్లో బంగారం ధర సాధారణంగానే ఔన్స్ లో కొలుస్తారు. ఇండియాలో మాత్రం బంగారాన్ని గ్రాములలో కొనుగోలు చేస్తాం. ఒక్క ఔన్స్ సుమారుగా 28.35 గ్రాములు.. 2026 నాటికి ఔన్స్ కి 4000 నుంచి 5000 ద్వారా చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు నిపుణులు. ప్రపంచ మార్కెట్లో బంగారం ధర గణనీయంగా పెరిగినట్లు అయితే ఒక గ్రామ ధర రూ. 14,000 రూపాయల నుంచి రూ.15,000 వరకు చేరే అవకాశం ఉంటుందట. దీని ఆధారంగా చేసుకున్నట్లు అయితే 10 గ్రాముల ధర రూ. 1,40,000 నుంచి రూ. 1,50,000 వరకు చేరే అవకాశం ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు. ఇదంతా కూడా కేవలం అంచనా మాత్రమే. మనదేశంలో రూపాయి విలువ డిమాండ్, పన్నులు, మరియు మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి మారుతూ ఉంటుందని తెలియజేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి