మొబైల్ ఫోన్స్ ఈమధ్య చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి వచ్చాయి. దాదాపుగా ఫోన్ చేసింది అవతలి వారు ఎవరని తెలుసుకోవడం కూడా థర్డ్ పార్టీ అప్లికేషన్ ద్వారా అందుబాటులోకి వచ్చేసింది. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ట్రూ కాలర్ అనే యాప్ ని ఎక్కువమంది ఉపయోగిస్తున్నారు. ఈ యాప్ లో తమ నెంబర్ ను ఏ పేరు సేవ్ చేసుకుంటే ఆ పేరు.. అవతలి వారికి ఫోన్ చేసినప్పుడు స్క్రీన్ లో కనిపిస్తుంది. ఇప్పుడు తాజాగా జియో, ఎయిర్టెల్ వంటి టెలికాం సంస్థలు ఇన్బిల్ట్ కాలర్ ఐడిని అందుబాటులోకి తీసుకువచ్చాయి.



ఇది కూడా  అవతలి వ్యక్తి ఏ పేరుతో కావాలనుకుంటే ఆ పేరుతో ఐడి డిస్ప్లే అయ్యల సదుపాయం కల్పించారు.. అయితే ఇలాంటి అడ్వాన్స్ వెలుసుబాటు సాంసంగ్ వంటి మొబైల్స్ ఫోన్లోనే అందుబాటులోకి తీసుకువచ్చాయి. అయితే ఇది కూడా 100% జన్యునిటీ లేదని టెక్ నిపుణులు తెలియజేస్తున్నారు. దీనివల్ల కూడా సైబర్ నేరగాళ్లు ఈజీగా మోసాలు చేస్తున్నారని తెలుపుతున్నారు. ట్రూ కాలర్ ద్వారా ఐపీఎస్ అధికారి, ఐఏఎస్ అధికారి, ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన అధికారి పేర్లను, మరికొన్ని పేర్లను  ఉపయోగిస్తూ రిజిస్టర్ చేసుకొని కాల్ చేస్తూ చాలామందిని మోసం చేస్తున్నారు.


కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి విషయాలపైన ఎంత ప్రయత్నించినా కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి మారింది. అయితే ఇటువంటి పరిస్థితుల్లోనే కేంద్ర టెలి కమ్యూనికేషన్ శాఖ ఒక సరికొత్త ఐడియాతో ముందుకి వచ్చింది.. అదేమిటంటే సిమ్ కార్డు కొనేటప్పుడే ఏ ఆధార్ కార్డు ఇస్తారో ఆ ఆధార్ కార్డులో ఉన్నటువంటి పేరుతో నెంబర్ బదులుగా స్క్రీన్ లో డిస్ప్లే అవుతుంది. ఇది 2026 మార్చి నుంచి అమలులోకి తీసుకువచ్చే కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. CNAP (కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్) అనే పేరుతో దీనిని అమలు చేయబోతున్నారు. ఇది వచ్చే ఏడాది ఆటోమేటిక్గా అన్ని మొబైల్స్ లలో కూడా అప్డేట్ అవుతుంది. దీనివల్ల ఎవరు ఫోన్ చేస్తున్నారనే నెంబర్ స్థానంలో పేరు కనిపిస్తుంది. దీని వల్ల సైబర్ క్రైమ్ కూడా నియంత్రణ అవుతుందని తెలుపుతున్నారు.. ఒకవేళ ఎవరైనా మాకు పేర్లు కాకుండా మొబైల్ నెంబర్ మాత్రమే డిస్ప్లే కావాలనుకునేవారు వాటిని ఆఫ్ చేసుకుని సదుపాయం కూడా కల్పిస్తుందట కేంద్ర ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి: