ఇటువంటి తరుణంలోనే వల్లభనేని వంశీకి మరో షాక్ తగిలినట్లుగా తెలుస్తోంది. విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ లో సునీల్ అనే వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు వంశీతో పాటుగా ఆయన అనుచరుల పైన పోలీస్ కేసు నమోదయ్యింది. సునీల్ తెలిపిన వివరాల ప్రకారం 2024 జులై నెలలో వంశీతో పాటుగా ఆయన అనుచరులు తన మీద దాడికి పాల్పడ్డారంటూ ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఆ ఘటనకు సంబంధించి తాజాగా పోలీసులను సైతం సునీల్ ఆశ్రయించగా కేసు నమోదు చేసినట్లుగా తెలియజేశారు.
ఈ క్రమంలోనే వల్లభనేని వంశీతో పాటుగా మరో ఎనిమిది మంది నిందితులు ఉన్నట్లుగా పోలీసులు తెలియజేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను సేకరించే పనిలో పోలీసులు దర్యాప్తుని కొనసాగిస్తున్నారు. ఇప్పటికే వల్లభనేని వంశీ పైన ఉన్న కేసులకు ఇప్పుడు తాజాగా మరొక కేసు నమోదు కావడంతో ఈ విషయం రాజకీయాలలోనే సంచలనంగా మారింది. వల్లభనేని వంశీ పైన ఇలా వరుస కేసులు నమోదు అవ్వడంతో ఆయన అనుచరులు, పలువురు నేతలు ఆందోళన చెందుతున్నారు. మరి ఈ విషయాలపైన వల్లపనేని వంశీ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి